సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీలో కలపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐయూరిపల్లి గ్రామ పంచాయతీని వేములవాడ మున్సిపాలిటీలో, తాడుకోలు గ్రామ పంచాయతీని భాన్సవాడ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా కలిపారని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై హైకోర్టు విచారించింది. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపొద్దని హైకోర్టు తెలిపింది. అంతేకాక యధావిధిగా ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment