సాక్షి, హైదరాబాద్: వివిధ విద్యా పథకాలను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య లు చేపట్టింది. పాఠశాల విద్యలో కీలకమైన సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), ఉపాద్యాయ విద్య, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పథకాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఆ మూడిం టినీ కలిపి ఇకపై ఒకే సమగ్ర విద్యా పథ కంగా అమలు చేసేందుకు చర్యలు చేప ట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రాల అభిప్రా యాలు, సలహాలు, సూచనలను కోరింది. త్వరలో ఆ మూడింటి స్థానంలో ఒకే సమగ్ర విద్యా పథకం అమల్లోకి రానుంది.
ప్రయోజనాలు చేకూరడం లేదని...
ఆర్‌ఎంఎస్‌ఏ మినహా మిగతా రెండు పథకాల వల్ల గత 15 ఏళ్లుగా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. నాణ్య మైన విద్య అనేది ఇప్పటికీ చాలెంజ్‌గానే మిగిలి పోయిందన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎన్‌ఏఎస్) వంటి వివిధ అధ్యయనాల్లో ఇప్పటికీ విద్యార్థులకు సరైన చదువు రావడం లేదన్న విషయం వెల్లడైంది.
ప్రాథమిక, సెకండరీ, ఉపాధ్యా య విద్యకు వేర్వేరు పథకాలు ప్రవేశపెట్టినా వాటి అమలులో సమన్వయ లోపంతో ప్రయోజనం ఉండటం లేదన్న వాస్తవాన్ని గ్రహించింది. ఎవరికివారు వేర్వేరు శిక్షణల పేరుతో, పథకాల అమలు పేరుతో చేపడు తున్న చర్యల వల్ల టీచర్లు బడుల్లో విద్యా బోధన నుంచి దూరం అవుతున్న వాస్తవాన్ని గ్రహించింది.
అందుకే సమగ్ర విద్యా పథకంపై దృష్టి
ఈ నేపథ్యంలో కేంద్రం సమగ్ర విద్యా విధా నం తీసుకు రావాలని నిర్ణయించింది. ఇం దులో భాగంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వా మ్యంతో కొనసాగిస్తున్న పాఠశాల విద్య లోని మూడు కీలక పథకాలను ఒకే పథకం కింద అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిం ది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, సమగ్ర విద్యా పథకం రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 30న అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment