ssa
-
ఒకే చోట 15 ఏళ్ల సర్వీసా..!
శ్రీకాకుళం న్యూకాలనీ: సమగ్రశిక్ష అభియాన్ జిల్లా కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్(ఎఫ్ఏఓ)గా ఓ వ్యక్తి 14 ఏళ్లుదాటి పనిచేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒకే పోస్టులో ఇన్నేళ్లపాటు రిలీవింగ్, బదిలీ ఉత్తర్వులు లేకుండా పనిచేస్తున్న ఉదంతంపై కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే సంబంధిత ఎఫ్ఏఓ పోస్టుకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేయాలని సమగ్రశిక్ష అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కవిటి మోహనరావు మాతృశాఖ ఖజానా శాఖ. సంబంధిత మాతృశాఖ నుంచి రిలీవింగ్ ఆర్డర్ లేకుండా, సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టరేట్ నుంచి బదిలీ ఉత్తర్వులు లేకుండా 2008లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ప్రస్తుతం సమగ్రశిక్షగా పేరు మార్చారు)లో అకౌంటెంట్‌గా విధుల్లో చేరారు. 8 ఏళ్లు పనిచేసిన తర్వాత అదే శాఖలో 2015 డిసెంబర్ 23 నుంచి (మధ్యలో కొన్ని నెలలు విధులకు దూరంగా ఉన్నారు) ఇప్పటి వరకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వ్యక్తిగత అవసరాల కోసం సెలవులు మంజూరు చేయమని ఏపీసీ జయప్రకాష్‌ను కోరడంతో రచ్చ మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని రోజులు కుదరదని, ఖజనాశాఖ నుంచి రిలీవింగ్ లెటర్ చూపించాలని, లేదా స్టేట్ సమగ్రశిక్ష ఆఫీస్ నుంచి బదిలీ ఉత్తర్వులైనా చూపించాలని కోరగా, అవేవీ తన వద్ద లేవని మోహనరావు బదులివ్వడంతో ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఏపీసీ నివేదించినట్లు తెలిసింది. ఈ ఉదంతంపై కలెక్టర్‌తోపాటు స్టేట్ సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వీ ఆరా తీసి ఫైల్ సిద్ధంచేయాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రోణంకి జయప్రకాష్ శాఖాపరంగా తీసుకున్న కార్యాలయం మార్పు, నిర్ణీత గడువుకు ముందే సెక్టోరియల్ అధికారుల తొలగింపు, కొత్త నోటిఫికేషన్ తదితర నిర్ణయాలను తప్పుపడుతూ ఎఫ్ఏవో సైతం ఏపీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ రెండు ఉదంతాలపై పూర్తి నివేదిక అందజేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. విచారణాధికారిగా సైతం నియమించారు. -
కేంద్ర నిధులు...తెలంగాణకే ముందు!
సాక్షి, హైదరాబాద్: సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ),రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ కింద తెలంగాణకే ముందుగా కేంద్ర నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో ఇచి్చన రూ. 382 కోట్లకు సకాలంలో రాష్ట్ర విద్యాశాఖ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇవ్వడంతో ఈసారి మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణకే రెండో విడత నిధులు ఇచి్చంది. రెండో విడత కింద రూ.452.62 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో తమ వాటా నిధులు రూ. 301.75 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. విద్యాశాఖలో మధ్యాహ్న భోజనం, విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల భవన నిర్మాణాలు తదితర కార్యక్రమాలకు (కేంద్ర ప్రాయోజిత పథకాలు) కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వేంచించాల్సిఉంది. గతంలో మొదటి విడత నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసేది. దీంతో విద్యాశాఖ కేంద్రానికి సకాలంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రెండో విడత నిధులు సకాలంలో వచ్చేవి కావు. అయితే ఈసారి రాష్ట్రం తమ మొదటి విడత వాటా నిధులను సకాలంలో విడుదల చేయడంతో కేంద్రం రెండో విడత నిధులను కూడా ఇచి్చంది. దీంతో సమగ్ర శిక్షా అభియాన్, రాష్రీ్టయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 834.62 కోట్లు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. -
అందరితో సమానంగా చూడాలి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగమేనని, వారిని అందరితో సమానంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సహాయ ఉపకరణాల నిర్ధారణ, పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవపరమైన అన్ని సదుపాయాలు కల్పించడం సమాజం బాధ్యత అని అన్నారు. 40శాతం ప్రభుత్వ నిధులు, 60శాతం ఎంపీ నిధుల్లో నుంచి ఈ పరికరాలను అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని 374 మంది దివ్యాంగులకు భవిత కేంద్రాల్లో చదువు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్న రీసోర్స్ పర్సన్ అలీంతో పాటు ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గతేడాది క్యాంప్ ద్వారా గుర్తించిన 164మంది పిల్లలకు కిట్స్, ట్రై సైకిళ్లు, ఎంఆర్ కిట్లు, బ్రెయిలీ కిట్లు అందజేశారు. శంకర్‌భవన్ స్కూల్ తనిఖీ అంతకుముందు శంకర్‌భవన్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లో వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎనిమిదో తరగ తి గదిలోకి వెళ్లి పిల్లలను సిలబస్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. -
విద్యా పథకాల కుదింపు
సాక్షి, హైదరాబాద్: వివిధ విద్యా పథకాలను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య లు చేపట్టింది. పాఠశాల విద్యలో కీలకమైన సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), ఉపాద్యాయ విద్య, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పథకాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఆ మూడిం టినీ కలిపి ఇకపై ఒకే సమగ్ర విద్యా పథ కంగా అమలు చేసేందుకు చర్యలు చేప ట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రాల అభిప్రా యాలు, సలహాలు, సూచనలను కోరింది. త్వరలో ఆ మూడింటి స్థానంలో ఒకే సమగ్ర విద్యా పథకం అమల్లోకి రానుంది. ప్రయోజనాలు చేకూరడం లేదని... ఆర్‌ఎంఎస్‌ఏ మినహా మిగతా రెండు పథకాల వల్ల గత 15 ఏళ్లుగా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. నాణ్య మైన విద్య అనేది ఇప్పటికీ చాలెంజ్‌గానే మిగిలి పోయిందన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) వంటి వివిధ అధ్యయనాల్లో ఇప్పటికీ విద్యార్థులకు సరైన చదువు రావడం లేదన్న విషయం వెల్లడైంది. ప్రాథమిక, సెకండరీ, ఉపాధ్యా య విద్యకు వేర్వేరు పథకాలు ప్రవేశపెట్టినా వాటి అమలులో సమన్వయ లోపంతో ప్రయోజనం ఉండటం లేదన్న వాస్తవాన్ని గ్రహించింది. ఎవరికివారు వేర్వేరు శిక్షణల పేరుతో, పథకాల అమలు పేరుతో చేపడు తున్న చర్యల వల్ల టీచర్లు బడుల్లో విద్యా బోధన నుంచి దూరం అవుతున్న వాస్తవాన్ని గ్రహించింది. అందుకే సమగ్ర విద్యా పథకంపై దృష్టి ఈ నేపథ్యంలో కేంద్రం సమగ్ర విద్యా విధా నం తీసుకు రావాలని నిర్ణయించింది. ఇం దులో భాగంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వా మ్యంతో కొనసాగిస్తున్న పాఠశాల విద్య లోని మూడు కీలక పథకాలను ఒకే పథకం కింద అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిం ది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, సమగ్ర విద్యా పథకం రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 30న అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. -
నిండా నిర్లక్ష్యం!
– ‘యూ డైస్’ పని చేయించుకున్నారు.. - రెమ్యూనరేషన్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు – ‘ నిధులు మంజూరు చేయని ఎస్ఎస్ఏ – ఏడాదిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు అనంతపురం ఎడ్యుకేషన్: అవసరానికి వాడుకుని వదిలేయడమంటే ఇదేనేమో. సరిగ్గా ఏడాది కిందట 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూ డైస్) వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన ఉద్యోగులకు నేటికీ రెమ్యూనరేషన్ అందలేదు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అసలు కథ ఇలా.. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, పని చేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు తదితర వివరాలను ఏటా యూడైస్‌లో ఆన్లైన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం విద్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. యూడైస్‌కు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. వివరాల నమోదులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చేసినా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అందుకే జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏడాది కిందట పని చేయించుకున్న సిబ్బందికి ఇప్పటిదాకా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఎమ్మార్సీల్లో పని చేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు చాలా కష్టపడ్డారు. రేయంతా కాచుకుని నమోదు యూడైస్ నమోదు సమయంలో రాష్ట్రమంతా ఒకేమారు ఆన్లైన్ ఓపెన్ కావడంతో సర్వర్ డౌన్ అవుతుంది. దీంతో సిబ్బంది అర్ధరాత్రి, తెల్లవారుజామున వరకు మేలుకుని వివరాలు నమోదు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. జిల్లాలో 5,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివరాలను గతేడాది యూడైస్‌లో నమోదు చేశారు. ఆన్లైన్ చేసినందుకు ఒక్కో స్కూల్‌కు రూ.80 కేటాయించారు. ఈలెక్కన మొత్తం రూ.4,09,120 జిల్లాకు రావాల్సి ఉంది. బడ్జెట్ రిలీజ్ అయినా.. వాస్తవానికి యూడైస్ వివరాలు నమోదు చేసినందుకు ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ బడ్జెట్‌ను ఇతరవాటికి ఖర్చు చేసినట్లు తెలిసింది. బిల్లు డ్రా చేయకపోవడం వెనుక ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఎస్ఎస్ఏలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పట్ల కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్ అందుబాటులో ఉన్నా..సంబంధిత ఫైలు పెట్టకుండా ఆ ఉద్యోగి చక్రం తిప్పాడు. ఒకానొక సందర్భంలో ఫైలు కనిపించకుండా చేశాడు. రెమ్యూనరేషన్ కోసం ఉద్యోగులు పలుమార్లు అడిగినా...అదిగో ఇదిగో అంటూ అధికారులు దాట వేస్తూ వచ్చారు. అడిగి అడిగి చివరకు వదిలేశామని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు వాపోతున్నారు. సదరు ఉద్యోగి నిర్లక్ష్యం వల్లే తమకు రెమ్యూనరేషన్ రాకుండా అగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెమ్యూనరేషన్ మంజూరయ్యేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యం ఏమంటున్నారంటే... నేను కొత్తగా వచ్చాను. గత ఏడాది చేపట్టిన యూడైస్ కార్యక్రమానికి సంబంధించి నాకు తెలీదు. ఆ ఫైలు గురించి విచారించి చర్యలు తీసుకుంటా. -
జాబ్ ఫర్ సేల్
- సర్వశిక్షాఅభియాన్‌లో ఉద్యోగాల విక్రయం - ఒక్కొక్క పోస్టుకు రూ. 50 వేల ధర నిర్ణయం జిల్లా కేంద్రంలోని సర్వశిక్షా అభియాన్ శాఖ పరిధిలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు బేరసారాలు సాగుతున్నాయి. ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకాలకు పరీక్షలు జరగకముందే ఆ శాఖలో జాబ్ ఫర్ సేల్ అన్న పేరుతో కౌంటర్లు తెరిచేశారు. పోస్టు ఏదైనా సరే... డబ్బులు సమర్పిస్తే చాలు... నియామక పత్రం చేతిలో పడినట్లే ! అంతేకాదు నచ్చిన ప్రదేశంలో ఉద్యోగం ఖాయం. ఇదీ ఎస్ఎస్ఏ అవినీతి బాగోతం చిత్తూరు ఎడ్యుకేషన్: సర్వశిక్షాఅభియాన్ కార్యాలయంలో రెగ్యులర్ పీఓ లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. దీంతో ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆశాఖ ఇన్చార్జి పీఓగా పనిచేస్తున్న ఇన్చార్జి డీఈఓ శామ్యూల్ ఆ శాఖపై సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ రెండు శాఖ లకు ఒకే అధికారి ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. అమ్మకానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు సర్వశిక్షాఅభియాన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒ క్కొక్క పోస్టుకు ఒక్కొక్క ధర నిర్ణయించి, విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న సీఆర్పీ, ఎంఐఎస్, ఐఈ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఆ శాఖలోని కొంతమంది సి బ్బంది వసూళ్ల పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆమోదం తెలిపి దరఖాస్తులు స్వీకరించి పరీక్షలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ బాధ్యతలన్నీ ఆ శాఖ అధికారులకే అప్పజెప్పడంతో అక్రమాలకు తెరలేచిం ది. ఆ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఒక్కొక్క పోస్టుకు రూ.50 వేలుగా ధర నిర్ణయించి, వసూలు చేసినట్లు సమాచారం. వసూళ్ల విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా గుట్టుచప్పుడుకాకుండా జరుగుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫార్సులు ఓ వైపు ఎస్ఎస్ఏ అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటుండగా మరో వైపు టీడీపీ ప్రజాప్రతినిధులు తాము సిఫార్సు చేసిన వారికి కచ్చితంగా ఉద్యోగం ఇవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. తాను చెప్పే 20 మందికి ఉద్యోగాలకు ఇవ్వాలని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి నుంచి ఆ శాఖ అధికారులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిసింది. అసలే నిరుద్యోగం వేలాది మంది అభ్యర్థులు ఉన్నత చదువులు చదివి ప ట్టాలు చేతబుచ్చుకుని సరైన ఉద్యోగం దొరక్క నిరుద్యోగులుగా మారారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో కి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలుపుకోకపోవడంతో ఉన్నత చదువులు చదివి కొలువులు లేక మిన్నకుండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఉన్నత విద్య చదివిన వారు కూడా చిరుద్యోగం కోసం వెంపర్లాడుతున్నారు. జిల్లా సర్వశిక్షాఅభియాన్లోని 162 పోస్టులకు 1400 మంది దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే ఆ పోస్టులు ముందుగానే అమ్ముడుపోతుండడంతో పలువురు నిరుద్యోగలు నిరాశపడుతున్నారు. -
నిధులున్నా.. నిష్ప్రయోజనం !
– ఎఫ్ఏఓ లేక ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఆగిన జీతభత్యాలు – రూ.6.06 కోట్ల బడ్జెట్ వచ్చినా జీతాలివ్వలేని పరిస్థితి – వేలాది మంది ఉద్యోగులు ఎదురుచూపులు అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉందని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగల వ్యథ. ఇన్ని రోజులూ బడ్జెట్ లేక జీతాలు ఇవ్వని సర్వశిక్ష అభియాన్ ఇప్పుడు నిధులున్నా...ఇవ్వలేని పరిస్థితి. జిల్లాకు సంబంధించి రూ.24 కోట్లు కావాలంటూ నివేదికలు రాష్ట్రానికి పంపారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రూ.6.6 కోట్లు కేటాయించారు. రెండు రోజుల క్రితం ఖాతాలోనూ జమ చేశారు. కానీ ఈ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్ఏఓ) లేకపోవడంతో జూన్ నెల జీతం ఇప్పటిదాకా రాలేదు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం. సర్వశిక్ష అభియాన్‌లో 63 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 63 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 357 మంది సీఆర్పీలు, 63 మంది మెసెంజర్లు, 378 మంది పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, 126 మంది ఐఈఆర్టీలు, 12 మంది డీఎల్ఎంటీలు, 756 మంది కేజీబీవీల సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కేజీబీవీల్లో పని చేస్తున్న ఎస్ఓలు, సీఆర్టీలు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు రాలేదు. ఫిబ్రవరి నుంచి బకాయిలున్నాయి. అలాగే ఎమ్మార్సీ ఉద్యోగులకు మార్చి నెల నుంచి అంటే నాలుగు నెలలుగా జీతాలు రాలేదు. చాలామంది ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారంగా మారిన కుటుంబ పోషణ : గతంలో నెలనెలా క్రమం తప్పకుండా జీతాలు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ అధ్వానంగా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు. వస్తున్న జీతాలు అంతంత మాత్రమేనని అవికూడా సరిగా ఇవ్వకపోతే ఎలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం తిరగాల్సి ఉంటుందని, నెలంతా పని చేసి జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంటోందంటున్నారు. కనీసం అప్పులు కూడా పుట్టడం లేదని కొందరు చెబుతుండగా, మరికొందరు అధికవడ్డీకి అప్పులు చేస్తున్నామంటూ వాపోతున్నారు. వీరి వేతనాలతో పాటు కార్ల అద్దె కూడా చెల్లించలేదని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు : ఇన్ని రోజులూ బడ్జెట్ లేక జీతాలు పెండింగ్ పెట్టారు. ప్రస్తుతం రూ. 6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఇందులో అందరీ ఉద్యోగులకు రెండు నెలల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పీఓ–ఎఫ్ఏఓ ఇద్దరూ సంతకాలు పెడితేనే ప్రతి పైసా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎఫ్ఏఓ పోస్టు ఖాళీగా ఉండటం కొసమెరుపు. బడ్జెట్ వచ్చింది : జీతాల కోసం రూ.6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఎఫ్ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈ విషయం ఎస్పీడీ అధికారులకు విన్నవించాం. వీలైనంత త్వరగా ఎఫ్‌ఏఓను నియమిస్తారు. ఎఫ్ఏఓ రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెన్నెళ్ల జీతాలు, రెగ్యులర్ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు జమ చేస్తాం. - సుబ్రమణ్యం, పీఓ ఎస్ఎస్ఏ -
ఎస్ఎస్ఏలో విద్యుత్ చౌర్యం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎవరైనా పేదవాళ్లు కరెంటును అక్రమంగా వాడుకుంటే వేలాది రూపాయలు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేసే విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కేంద్రంలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో యథేచ్చగా కరెంటును అక్రమంగా వాడుకుంటున్నా కనిపించడం లేదు. విద్యుత్‌నగర్ సర్కిల్లో ఉన్న ఎస్ఎస్ఏ కార్యాలయాన్ని ఇటీవల టీవీ టవర్ వెనుకకు మార్చారు. పీఓ చాంబర్, ఇంజినీరింగ్ విభాగానికి పక్కా కరెంటు ఉంది. అయితే ఎఫ్ఏఓ, జీసీడీఓ, సీఎంఓ, ప్లానింగ్ కోఆర్డినేటర్, ఐఈడీ కోఆర్డినేటర్, అకడమిక్ మానటరింగ్ అధికారి, అలెస్కో విభాగాల గదులతో పాటు సమావేశ హాలుకు కరెంట్ సదుపాయం లేదు. దీంతో అక్రమంగా కరెంటు తీగలకు కొక్కీలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అయితే కరెంటు కనెక్షన్ కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. వారి నుంచి ఇంకా అనుమతులు రాలేదు. కొక్కీలు తగిలించి.. తమదీ ప్రభుత్వ కార్యాలయమే కదా? ఏమవుతుందిలే అనుకున్నారో ఏమోకాని ఎంచక్కా విద్యుత్ తీగలకు కొక్కీలు తగిలించి కరెంటును వాడుకుంటున్నారు. ఇటీవల ఓరోజు అక్రమంగా కరెంట్ వాడుతున్న విభాగాలకు కరెంటు సరఫరా ఆగిపోయింది. ఒకరిద్దరు సిబ్బంది నేరుగా విద్యుత్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరారు. ఫలానా స్తంభం నంబరు చెప్పగానే అవతలి నుంచి గట్టిగా స్పందించడంతో కంగుతినడం వీరి వంతైంది. అనుమతి తీసుకోకుండా దొంగ కరెంటు ఎలా వాడుతున్నారంటూ విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పరిశీలించి జరిమానా వేస్తామని హెచ్చరించడంతో ఫోన్ కట్ చేయడం ఇవతలివారి వంతైంది. ఇదండీ ఎస్ఎస్ఏ కార్యాలయంలో విద్యుత్ చౌర్యం తీరు. అలా వాడడం తప్పే అనుమతి లేకుండా విద్యుత్ తీగలకు కొక్కీలు తగిలించి కరెంటు వాడుకోవడం తప్పే. కరెంటు సరఫరా లేకపోతే ఉన్న విభాగాల నుంచి తీసుకోవాలి తప్ప అలా నేరుగా కరెంటు స్తంభం నుంచి తీసుకోకూడదు. నేను కొత్తగా విధుల్లోకి వచ్చా. నాకు విషయం తెలీదు. మా సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. – సుబ్రహ్మణ్యం, పీఓ -
‘యూనిఫాం’ ఘటనపై విచారణకు ఆదేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : 2016–17 విద్యా సంవత్సరంలో ముదిగుబ్బ మండలంలోని విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయని అంశం అనవసరంగా తమ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని భావించిన ఎస్ఎస్ఏ అధికారులు తేరుకున్నారు. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి రిజాయిండరీ ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చని భావించారు. అయితే ఇది కాస్తా జిల్లా కలెక్టర్‌తో పాటు, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అనవసరంగా ఇబ్బందులు వస్తాయని భావించిన ఎస్ఎస్ఏ అధికారులు యూనిఫాం సరఫరా కాని వైనంపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ గోపాల్‌నాయక్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. కాగా...కొలతలు ఎక్కువ తక్కువగా ఉండటంతో ముదిగుబ్బ మండలం విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేయలేకపోయామని చెప్పిన అధికారులు దీనిపై మళ్లీ ‘సాక్షి’లో కథనం కావడంతో కలవరపాటుకు గురయ్యారు. విచారణ చేయించి వాస్తవ విషయాలను కలెక్టర్, ఎస్పీడీ అధికారులకు నివేదిస్తామని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతున్నారు. -
‘సహిత’ ప్రణాళిక పక్కగా అమలవ్వాలి
ఎస్ఎస్ఏ అధికారులకు కలెక్టర్ ఆదేశం విద్యా పాఠ్యాంశాల ప్రణాళిక విడుదల అనంతపురం అర్బన్: సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం రూపొందించిన సహిత విద్యా పాఠ్యాంశాల ప్రణాళిక పక్కగా అమలవ్వాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సహిత విద్యా ప్రణాళిక మాడ్యూల్‌ను కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు, వినికిడి లోపం ఉన్న వారికి ఈ పాఠ్యాంశాల ఎంతగానో ఉపయోగపతాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.వెంకటే శ్వర్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, ఆన్సెట్ సీఈఓ వెంకటేశం, కార్యక్రమం కో–ఆర్డినేటర్ పాండురంగ, సహాయ సామాజిక చైతన్య విభాగం అధికారి కిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తు చేసుకోండి
కర్నూలు(అర్బన్): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యారంగ వార్తా కథన పురస్కారాలు –2016 కోసం జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్షా అభియాన్ పథక అధికారి రామచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2016 జనవరి 1వ తేది నుంచి 2016 డిసెంబర్ 31వ తేది వరకు విద్యారంగంపై వివిధ పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమైన, టెలివిజన్ తెలుగు చానల్స్‌లో ప్రసారమైన వార్తా కథనాలకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడు కేటగిరీల్లో ఇచ్చే అవార్డుల కోసం తెలుగు, ఇంగ్లిషు, పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయుల దరఖాస్తుల గడువును ఏప్రెల్ 20వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఎంట్రీలను రాష్ట్ర పథక సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ విజయవాడకు అందే విధంగా పంపాలన్నారు. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు. ఏ కేటగిరీకి పంపుతున్న ఎంట్రీని స్పష్టంగా కవరుపై రాయాలన్నారు. పూర్తి వివరాల కోసం ఎస్ఎస్ఏ వెబ్సైట్ www.ssa.ap.gov.inను చూడాలన్నారు. -
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యారంగ వార్తా కథన పురస్కారాలు–2016 కోసం దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ వై. రామచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1వ తేదీ 2016 నుంచి డిసెంబర్ నెల 31వ తేదీ 2016 వరకు విద్యారంగం మీద వివిధ పత్రికలు, టీవీ ఛానల్స్‌లలో ప్రసారాలు అయిన కథనాలకు ఈ అవార్డులు ఇస్తారని పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలుగు, ఇంగ్లిషు పత్రికలు, తెలుగు చానల్స్ విభాగాల్లో పురస్కారం కింద రూ.25 వేలు నగదు, జ్ఞాపికను ఇస్తారని, ఏ క్యాటగిరికి ఎంట్రీ పంపుతున్నారో స్పష్టంగా తెలిసేటట్లు కవరుపై రాయాలని సూచించారు. -
విద్యార్థుల వివరాలతోనే నిధుల విడుదల!
►ఆన్లైన్లో విద్యార్థుల నమోదుకు ఇదివరకే కేంద్రం ఆదేశాలు ►అయినా స్పందించని మదర్సాలు, ఎన్సీఎల్పీ కేంద్రాలు ►నిధుల దుర్వినియోగంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు ►నెలాఖరులోగా వివరాలు నమోదు చేయాలని ఎస్ఎస్ఏ గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, మదర్సాలు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ) కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే నిధుల విషయమై ఇకనుంచి విద్యాశాఖ పక్కాగా వ్యవహరించనుంది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగానే నిధులను కేటాయించనుంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలు! సర్వశిక్ష అభియాన్ ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో 500 వరకు మదర్సాలు, ఎన్సీఎల్పీ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. వాటి నిర్వహణ కింద ఒక్కో విద్యార్థికి ఎస్ఎస్ఏ రూ. 6,500 వరకు నిధులను చెల్లిస్తోంది. ఇవికాకుండా సబ్జెక్టులు బోధించే వలంటీర్లకు ఒక్కొక్కరికి వేతనాలను కూడా ఎస్ఎస్ఏ ఇస్తోంది. ఇలా మొత్తంగా వాటి నిర్వహణకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే ఇన్నాళ్లూ వాటిల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం, మదర్సాల్లో వలంటీర్లను నియమించకుండానే నిధులను మింగేసినట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విద్యాశాఖ విచారణ కూడా జరిపింది. హైదరాబాద్‌లో ఈ అక్రమాల విషయంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు సస్పెండ్ కూడా అయ్యారు. మదర్సాల మౌనం... విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు మదర్సాలు ముందుకు రావడం లేదు. గతేడాది (2015–16) లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మదర్సాల్లో 57,321 మంది విద్యార్థులు ఉన్నట్లు నిర్వాహకులు వివరాలిచ్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా అంతే మంది ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 17,836 మంది వివరాలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. ఇంకా 39,485 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. వారంతా ఉన్నట్టా? లేనట్టా? అన్నది ప్రశ్నగా మారింది. నిజంగా లేకపోతే ఇన్నాళ్లూ పేపరుపై లెక్కలు చూపించి, నిర్వహణ సంస్థలు నిధులను మింగేశారా? అన్న అనుమానాలు అధికారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీలోగా విద్యార్థులు అందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సర్వశిక్ష అభియాన్ తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను నమోదైన 17,836 మందికి సంబంధించి ఆధార్ లింకు కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు అందులో కేవలం 8,804 మందికి సంబంధించి మాత్రమే ఆధార్ లింకు పూర్తయింది. ఇక ఆధార్‌తో అనుసంధానం చేస్తే విద్యార్థుల తాలూకు పూర్తి వివరాలు బయటపడునున్నాయి. -
వేతన జీవుల అవస్థలు
ఎస్ఎస్ఏ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులకు 'ఎల్పీసీ' అడ్డంకి ఐదు నెలలుగా జీతాలకు బ్రేక్ అనంతపురం ఎడ్యుకేషన్ : నెల రోజులు పనిచేసి ఒకటో తేదీన జీతం కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తారు. కానీ డిప్యూటేషన్‌పై సర్వశిక్ష అభియాన్‌లో పనిచేసి తిరిగి మాతృశాఖ, ఇతర శాఖలకు వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఐదు నెలలుగా జీతాలందక అవస్థలు పడుతున్నారు. జీతాలు ఎందుకు ఆపారో తెలియక, 'ఎల్పీసీ' (లాస్ట్ పే సర్టిఫికెట్) ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఇలా.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా డిప్యూటేషన్‌లో పని చేస్తూ మరోశాఖకు బదిలీ అయితే అతనికి సంబంధించి 15 రోజుల్లో ఎల్పీసీ ఇవ్వాలి. నెల జీతం బ్రేక్ పడకుండా చూడాలి. పని చేస్తున్న చోటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెండింగ్ ఉన్నా...ఎల్‌పీసీకి కొర్రీ వేయరాదు. బదిలీపై వెళ్లిన శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి వాటిని రాబట్టుకోవాలి. తప్ప పెండింగ్ పెట్టరాదు. ఎస్ఎస్ఏలో జరిగిందిలా... డీఈగా పని చేసిన బాలాజీనాయక్ జూలై మొదటివారంలో, ఇన్చార్జ్ ఈఈగా పని చేసిన వెంకటస్వామి అదేనెల చివరివారంలో బదిలీపై వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన సూర్యనారాయణరెడ్డి మేలో, ఇక్బాల్ జూన్‌లో, ఎఫ్ఏఓ పార్వతి, అలెస్కోగా పని చేసిన వెంకటరమణనాయక్ అక్టోబర్‌లో ఇక్కడి ఎస్ఎస్ఏ నుంచి ఇతర శాఖలకు వెళ్లారు. అప్పటి నుంచి వీరు ఎల్పీసీల కోసం తిరుగుతున్నా..పట్టించుకునే నాథుడే లేరు. డబ్బు లేక అల్లాడుతున్నానంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. కాగా వీరిలో ఎఫ్ఏఓ పార్వతి, సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, అలెస్కో వెంకటరమణనాయక్‌కు ఇటీవల ఎల్పీసీ ఇచ్చారు. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే... – దశరథరామయ్య, ఎస్ఎస్ఏ పీఓ ఆర్థికపరమైన వ్యవహారాల వల్ల ఎల్పీసీలు ఇవ్వడం కొద్దిగా ఆలస్యమవుతోంది. కోట్లాది రూపాయలు చేసిన పనులు, అడ్వాన్స్‌లకు లెక్కలు చెప్పకుండా, వివరాలు ఇవ్వకుండా వెళ్తే రేప్పొద్దున ఆడిట్ ఇబ్బందులు వస్తాయి. వాటిని క్లియర్ చేయాలని అందరికీ సూచించాం. కొందరు ఉద్యోగులు ఖాళీ చెక్కులు ఇష్యూ చేశారు, ఓ ఉద్యోగి కీలకమైన ఫైళ్లు గల్లంతు చేశారు. వీటన్నంటినీ క్లియర్ చేయాలని చెప్పాం. క్లియర్ చేసిన కొందరికి ఎల్పీసీలు ఇచ్చేశాం. తక్కిన వారికి కూడా సిద్ధం చేస్తున్నాం. -
ఐఈఆర్టీల నియామకాలకు దరఖాస్తులు
ఏలూరు సిటీ : సర్వశిక్షాభియాన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై ఐఈఆర్టీల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్ఎస్ఓ పీఓ వీ.బ్రహ్మానందరెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 27 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఎంఆర్ 21, హెచ్ఐ 5, వీఐ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నేటి నుంచి ఏలూరులోని ఎస్ఎస్ఎ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు ఉచితంగా అందచేస్తామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 12వ తేది సాయంత్రం 5 గంటలలోగా స్వయంగా సమర్పించాలని కోరారు. -
డీఈఓ ఆఫీస్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల విభజన
కలిపేసి సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపు పలువురు ఉద్యోగుల ఆందోళన విద్యారణ్యపురి : హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఉద్యోగులు, సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు ఉద్యోగులను కలిపి సీనియారిటీ ప్రాతిపదికన నాలు గు జిల్లాలకు కేటాయించారు. దీంతో కొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లను ఈనెల 26న రాత్రి డీఈఓ పీ.రాజీవ్ తన చాంబర్లోకి పిలిచి సీనియార్టీ ప్రతిపదికన పిలిచి జిల్లాలకు కేటాయించారు. అంతకుముందే సూపరింటెండెంట్లు 8 మందిని కూడా కలిపి సీనియార్టీ ప్రకారం కేటాయించారు. వరంగల్ జిల్లాను భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్విభజన చేస్తున్న విషయం తెలిసిందే. డీఈఓ కార్యాలయంలోని 14 సీనియర్ అసిస్టెంట్లతోపాటు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు కూడా కలుపగా మొత్తం 21మంది సీనియర్ అసిస్టెంట్లతో సీనియార్టీ రూపొందించి వారిని జిల్లాలకు కేటాయిం చారు. దీంతో పలువురు ఎస్ఎస్ఏలోని సీనియర్ అసిస్టెంట్లు తమను ఎలా డీఈఓ కార్యాలయం ఉద్యోగులతో కలిపి సీనియా ర్టీ రూపొందిస్తారని, దీంతో తాము భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని పలువురు డీఈఓ పి.రాజీవ్‌తో వాగ్వాదానికి ది గారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మౌఖిక ఆదేశాలతోనే కలిపి సీనియారిటీ ప్రాతిపదికను జిల్లాలకు కేటాయిస్తున్నామని డీఈవో పేర్కొన్నారు. అసలు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టును డీఈవో పరిధిలోకి విలీనం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదని, ఆ రెండుశాఖల ఉద్యోగులను కలిపి సీనియారిటీ రూపొం దించాలని కూడా ఉత్తర్వులు రాలేదని, అయినా ఇలా ఎలా కేటాయిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఎస్ఎస్ఏను డీఈఓ పరిధిలోకి చేర్చినా కూడా అందులో పని చేసే వారిని సీనియార్టీ ప్రకారంగానే జిల్లాలకు కేటాయించాలని అన్నారు. ఈమేరకు పలువురు మహిళా ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ను విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నా రు. ఈ విషయంపై మంగళవారం ‘సాక్షి’ డీఈవో పి.రాజీవ్‌ను వివరణ కోరగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు రెండు రకాలుగా ఉద్యోగులను విభజించి జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికను కేటాయిస్తూ వారి పేర్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయిస్తూ ఒక జాబితా, డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏలోని ఉద్యోగులను కలిపి సీని యార్టీ ప్రతిపదికన మరో జాబితా రూపొం దించి ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలి పారు. వీటిలో దేన్ని అమలు చేస్తారో వేచి చూడాలని తెలిపారు. పలుమార్లు వీడియో కాన్ఫరెన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టును డీఈవో పరిధిలోకే విలీనం చేస్తారని చెప్పారని పేర్కొన్నారు. అందుకే రెండూ కలిపి సినియారిటీ ప్రాతిపదిన కేటాయించామన్నారు. -
భవిత కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయాలి
కడప ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవితకేంద్రాలలో సేవలను విసృతం చేయాలని, అందుకు ఎస్‌ఎస్‌ఏతోపాటు ఆర్ఎస్ఎంఏ కూడా చేయూత నివ్వనున్నట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్యలు పేర్కొన్నారు. కడప నగరం ఎమ్మార్సీలో శుక్రవారం ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్సు టీచర్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఎక్కువ పిల్లలున్న చోట ఇంకొక కేర్లివింగ్ వాలంటీర్‌ను(ఆయా) ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రాజెక్టు అధికారి భవితకేంద్రానికి ఫిజియోథెరిఫి సేవలు నిరంతరం అందించే యోచనలో ఉన్నారన్నారు. భవితకేంద్రాలలో ఏవైనా సక్సెస్ స్టోరీస్ ఉంటే పక్కాగా రికార్డు చేయాలన్నారు. ఐఈడీ జిల్లా కోర్డినేటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా 9,10 తరగతి బాలికలకు 200 రుపాయల సై్టఫండ్ ఇస్తుందని బాలికల వివరాలను ఆన్లైన్లో పంపాలని వివరించారు. డిప్యూటీ డీఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ ఐఈఆర్టీలు వారి మండలాల విద్యాశాఖాధికారులతో కలిసి భవితకేంద్రాలకు విడుదలయ్యే గ్రాంటును పిల్లల అవసరాలకు వినియోగించేలా చూడాలన్నారు. అనంతరం ఏఎస్ఓ గురుస్వామి కంప్యూటర్ ఆపరేట్ భాస్కర్ కలిసి ప్రొజెక్టర్ ద్వారా ఐఈడీఎస్‌ఎస్ ఆన్లైన్లో ఏవిధంగా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అందరూ ఐఈఆర్టీలు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి : జిల్లాలోని సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కార్యాలయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రోగ్రామర్ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్, బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్హతలతో పాటు డాటా బేస్‌లో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9న సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయం నుంచి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. -
విద్యా వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్సార్ సర్కిల్: జిల్లాలోని ఎర్రగుంట్ల, చక్రాయపేట, మైలవరం, సిద్దవటం, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, మైదుకూరు, బద్వేలు, రామాపురం, ఓబులవారిపల్లె, కడప, వల్లూరు మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విద్యా వలంటీర్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకట సుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు డీఈడీ, బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. నెలకు వేతనంగా రూ.4 వేలు ఇస్తారని, అభ్యర్థుల ఎంపికలు రాయచోటి ఎస్ఎస్ఏ, డైట్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 23లోగా పంపాలని కోరారు. -
విద్యా వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్సార్ సర్కిల్: జిల్లాలోని ఎర్రగుంట్ల, చక్రాయపేట, మైలవరం, సిద్దవటం, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, మైదుకూరు, బద్వేలు, రామాపురం, ఓబులవారిపల్లె, కడప, వల్లూరు మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విద్యా వలంటీర్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకట సుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు డీఈడీ, బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. నెలకు వేతనంగా రూ.4 వేలు ఇస్తారని, అభ్యర్థుల ఎంపికలు రాయచోటి ఎస్ఎస్ఏ, డైట్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 23లోగా పంపాలని కోరారు. -
సర్వ శిక్షా అభియాన్ పీవో వ్యవస్థ రద్దు!
* డీఈవోల అధీనంలో ఎస్ఎస్ఏ కార్యకలాపాలు నిర్వహణ * కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యాశాఖ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సర్వశిక్షా అభియాన్‌లోని(ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు ఆఫీసర్(పీవో) వ్యవస్థను రద్దు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా విద్యా శాకాధికారి(డీఈవో) నేతృత్వంలోనే ఎస్ఎస్ఏ కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తోం ది. ఇందుకోసం డీఈవో కింద అసిస్టెంట్ డెరైక్టర్ కేడర్‌లో ఓ అధికారిని నియమించాలని యోచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యాశాఖ పునర్వ్యస్థీకరణ, విద్యా కార్యకలాపాల నిర్వహణపై దృష్టి సారించింది. దీనిపై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆ శాఖ సీనియర్ అధికారులు, అదనపు డెరైక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. రాష్ట్రంలోని 634 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ), మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాల నిర్వహణకు డీఈవో అధీనంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేజీబీవీల్లో రాష్ట్రస్థాయిలో 10 మంది గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీవీ), మోడల్ స్కూళ్లలో 9 మంది జీసీడీవోలు, గురుకులాల్లో 3 అకడమిక్ గెడైన్స్ అధికారులు ఉన్నారు. వారందరిని జిల్లాలకు పంపించాలని, రాష్ట్రస్థాయి కార్యాలయంలో కార్యకలాపాలను ఆన్లైన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణను జిల్లా విద్యాశిక్షణ సంస్థలకు(డైట్) అప్పగించనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం పనులను కూడా డీఈవోల నేతృత్వంలో కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 391 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో వారానికి ఐదుకు బదులు ఆరు కోడి గుడ్లను విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. త్వరలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కేజీబీవీల్లో 7, 8, 9 తరగతుల్లో త్వరలోనే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రవేశ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో 30 మంది విద్యార్థులతో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. మోడల్ స్కూళ్లలోని 11, 12వ తరగతి విద్యార్థులకు ఎన్సీసీని ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. -
స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఆహ్వానం
గొలుగొండ: స్వచ్ఛ్ విద్యాలయ పురస్కారాలకు అన్ని పాఠశాల వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్ఎస్ఏ ప్రతినిధి ప్రసాద్ సూచించారు. చీడిగుమ్మల గ్రామంలో సోమవారం అన్ని పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్ధుల వ్యక్తిగత పరిశుభ్రత తదితర అన్ని అంశాలూ బాగుండాలన్నారు. మౌలిక సదుపాయాలు బాగున్నా పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కాలకు ఎంపికవుతాయని తెలిపారు. ఎంఈవో గండేపల్లి నాగేంద్ర మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన పాఠశాలలు ఎంపిక కావడానికి ఉపాధ్యాయులు కషి చేయాలని కోరారు. మౌలిక సదుపాయల వివరాలు, ఫొటోలు నెట్లో పొందుపరచాలని కోరారు. -
గ్రహణంమొర్రి పిల్లలకు ఆపరేషన్లు
ముకరంపుర: జిల్లాలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా గుర్తించిన గ్రహణంమొర్రి గల 14 సంవత్సరాలలోపు 21 మంది విద్యార్థులకు హైదరాబాద్‌లోని ఏవీఆర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. విద్యార్థులను జిల్లా ఐఇ కో ఆర్డినేటర్ ఆర్.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్ సుభాషిణి, ఎస్ఎస్ఎ హైదరాబాద్ ఏఎస్పీడీ భాస్కర్‌రావు పరామర్శించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత రవాణా, మందుల ఖర్చులను ఎస్ఎస్ఏ తరఫున అందించారు. -
డీఎల్ఎంటీలు సీఆర్టీలుగా నియామకం
విద్యారణ్యపురి : జిల్లాలో తెలంగాణ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీం (డీఎల్‌ఎంటీ) పోస్టులను రద్దు చేశారు. డీఎల్ఎంటీలుగా పనిచేసిన వారి సర్వీస్‌ను వినియోగించుకునేందుకు గాను అందులో అర్హులైన వారిని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ( కేజీబీవీ) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్లు (సీఆర్టీ)గా నియామకం చేస్తూ సర్వశిక్షాభియాన్ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో తొమ్మిది మంది డీఎల్ఎంటీలు 2012 నుంచి పని చేస్తున్నారు. డీఎల్‌ఎంటీగా పనిచేస్తున్న డి.రేణుకను జనగామ కేజీ బీవీ మ్యాథ్స్ సీఆర్టీగా, ఎం.స్వప్నను ఏటూరునాగారం ఫిజికల్ సైన్స్ సీఆర్టీగా, జె.స్వప్నను కొడకండ్ల ఇంగ్లిష్ సీఆర్టీగా, జి. చైతన్య శాయంపేట బయోసైన్స్ సీఆర్టీగా, ఏ.కవితను కొత్తగూడెం ఫిజికల్సైన్స్ సీఆర్టీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
నేడు రేడియో ద్వారా సర్వశిక్ష అభియాన్ అదనపు సంచాలకుల ప్రసంగం
నల్లగొండ టూటౌన్ : స్వచ్ఛ విద్యాలయ పురస్కారం – 2016లో భాగంగా సోమవారం ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఆల్ ఇండియా రేడియో ద్వారా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అదనపు సంచాలకులు ప్రసంగిస్తారని జిల్లా ప్రాజెక్టు అధికారి కిరణ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండల ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు రేడియో ద్వారా సందేశాన్ని వినాలని కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే 040–23234834, 23232836 నెంబర్లకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. -
సర్వ శిక్ష అభియాన్
► ఐదుగురు అధికారుల తొలగింపునకు రంగం సిద్ధం? ►మరో ఇద్దరిపై బదిలీవేటు..? ►రేపోమాపో ఉత్తర్వులు డీఈవోపై ఒత్తిళ్లు ► కొంపముంచిన ఉత్తరాలు కరీంనగర్ ఎడ్యుకేషన్ : సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా కార్యాల యంలో అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. సమన్వయం కొరవడి ఒకరి విభాగాలపై మరొకరు ఉత్తరాల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల ఓ అజ్ఞాత వ్యక్తి సర్వశిక్ష అభియాన్‌లో పెద్దఎత్తున అవి నీతి, అక్రమాలు జరుగుతున్నాయని, సెక్టోరల్ అధికారులంతా తిష్టవేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు.. అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్పీ, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్, కలెక్టర్‌కు మెయిల్ ద్వారా లేఖలు పం పించారు. ఇది జిల్లా విద్యాశాఖలో కలకలం రేపుతోం ది. ఈ క్రమంలో సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి, డీఈవో శ్రీనివాసాచారి ఎస్ఎస్ఏ కార్యాలయంలో అసలేం జరుగుతోంది..? ఎంతమంది ఉద్యోగులు డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు..? ఎన్నేళ్లుగా తిష్టవేశారు..? అనే అంశాలపై పూర్తిగా ఆరాతీశారు. ఎస్ఎస్ఏ కార్యాలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర నివేదికను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో నిబంధనలకు విరుద్దంగా తిష్టవేసి ప్రభుత్వ కార్యక్రమాలు, విధులు సక్రమంగా నిర్వర్తించకుండా విద్యాశాఖ పరువును బజారుకీడిస్తున్న వారిపట్ల వేటు వేయడానికి ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్ మొగ్గుచూపినట్లు సమాచారం. సెక్టోరల్ అధికారుల డెప్యుటేషన్లు రద్దు..? ఫారన్ సర్వీసులో సర్వశిక్షాభియాన్‌లో పనిచేసేందుకు వచ్చిన సెక్టోరల్ అధికారులు నిబంధనల ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో అన్నివిభాగాల్లోను విద్యాశాఖ నుంచి డెప్యుటేషన్లు వేరుుంచుకుని ఉత్తర్వు లు లేకుండానే విధుల్లో కొనసాగుతున్నారు. సీఎంవో శ్రీనివాస్, ఏఎంవో ప్రభాకర్‌రావు, ఏపీవో బి.రాజేంద ర్, ఎఎస్వో రఘునందన్‌రావు, సూపరింటెండెంట్ రాజశేఖర్ ఫారన్ సర్వీసులో వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ఐదేళ్లు గడుస్తున్నా తిరిగి మాతృసంస్థ(విద్యాశాఖ)కు వెళ్లడంలేదు. అధికారులను మచ్చిక చేసుకుంటూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీనికితోడు ఆధిపత్య పోరులో భాగంగా కార్యాలయ వ్యవహారాలను బహిర్గతం చేయడం, ఒకరిశాఖపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. మరో ఇద్దరిపై బదిలీ వేటు...? సర్వశిక్షాభియాన్‌లో పనిచేస్తున్న జీసీడీఏ అనురాధ, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజభాను చంద్రప్రకాశ్‌ను కూ డా తప్పించాలని అధికారులకు నివేదించిన లేఖలో ఉన్నట్లు సమాచారం. కార్యాలయంలో జరిగే వ్యవహా రంపై సమన్వయం కొరవడడంతోనే మెయిల్ ఉత్తర, ప్రత్యుత్తరాల పరంపర కొనసాగిందని, ఇలాంటి తరుణంలో సెక్టోరల్ అధికారులందరినీ తొలగించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రేపోమాపో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ నుంచి సెక్టోరల్ అధికారులందరినీ మాతృసంస్థకు పంపుతూ.. డెప్యుటేషన్లు రద్దు చేసేలా ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. డీఈవోపై ఒత్తిళ్లు సర్వశిక్షాభియాన్‌లో జరుగుతున్న వ్యవహారంపై డీఈవో శ్రీనివాసాచారి నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. దీంతో సెక్టోరల్ అధికారులందరినీ మాతృసంస్థ(విద్యాశాఖ)కు పంపడమే ఉత్తమమని రాష్ట్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించారు. ఎస్ఎస్ఏ డెరైక్టర్ నుంచి సెక్టోరల్ అధికారులందరినీ విధుల్లో నుంచి తోలగించాలనే ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని తేలింది. కోన్నేళ్లుగా తిష్టవేసిన సెక్టోరల్ అధికారులు.. రాజకీయ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టేక్కించాలని తిరిగి తమను యధావిధిగా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో ఉంచేలా చూడాలని డీఈవోపై ప్రజాప్రతినిధులతో ఒత్తిళ్లు అధికమవుతున్నట్లు సమాచారం. -
అడ్రెస్ లేదు!
► విద్యార్థుల యూనిఫాం కోసం ఇండెంట్ కూడా పంపని అధికారులు ► గత తప్పిదాలు పునరావృతం ► మేల్కోని విద్యా శాఖ కంబదూరు మండలం తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో 133 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రామం పక్కనే ఉన్న ఓబుగానపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 83 మంది చదువుతున్నారు. ఈ రెండు స్కూళ్ల విద్యార్థులకు 2015-16 విద్యా సంవత్సరంలో ఒక్క జత యూనిఫాం కూడా ఇవ్వలేదు. ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో అధికారులు బుట్టదాఖలు చేశారనేందుకు ఈ రెండు స్కూళ్లే నిదర్శనం. జిల్లాలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు అన్ని స్కూళ్లకు ఏప్రిల్ మూడో వారంలో యూనిఫాం పంపిణీ చేశారు. అంటే విద్యా సంవత్సరం చివరి రోజుల్లో ఇచ్చారు. అధికారుల అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు కలర్ దుస్తులతోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతియేటా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 13న పునఃప్రారంభం కానున్నాయి. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా 1-8 తరగతుల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో1-8 తరగతుల విద్యార్థులు 2,99,632 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. 1-7 తరగతుల బాలురకు చొక్కా- నిక్కర్, బాలికలకు చొక్కా- స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు పంపిణీ చేయాలి. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి కావాలి. అయితే.. ఇప్పటిదాకా ఏ ఒక్క మండలం నుంచి ఇండెంట్ పంపలేదు. మండల విద్యాశాఖ అధికారులు ఇండెంట్ పెడితే ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తారు. తర్వాత కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే సుమారు 3-4 నెలలు పట్టే అవకాశముందని టీచర్లు చెబుతున్నారు. ఏటా ఇదే తంతు : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే యూనిఫాం, పుస్తకాలు విక్రయిస్తున్నాయి. దీంతో ఆయా పాఠశాలల విద్యార్థులు తొలిరోజు నుంచే యూనిఫాంతో బడికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల పరిస్థితి ఇందుకు భిన్నం. అధికారుల అలసత్వం కారణంగా వారికి యూనిఫాం పంపిణీలో ప్రతిసారీ జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రతి సమావేశంలోనూ ఊదరకొడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. -
అంతా ఆయనే!
కలెక్టరేటు ► ఏ ఫైల్ అయినా ఆయన చూడాల్సిందే ► ఏ నియామకానికైనా చేయి తడపాల్సిందే ► జిల్లా కేంద్రంలో ఓ అధికారి పెత్తనం ప్రాపకం ఉంటే ఏం చేసినా.. ఎంత తిన్నా చెల్లుబాటు అవుతుందనడానికి కలెక్టరేట్ వేదికవుతోంది. నియామకాలు, బదిలీల్లో ఓ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. స్వయంగా ఓ ఉన్నతాధికారే ఆయనకు పెత్తనం కట్టబెట్టడంతో ఫిర్యాదు చేసేందుకు సైతం ఉద్యోగులు జంకుతున్నారు. - సాక్షి, కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఓ మూలన ఉండే విభాగానికి ఆయన ఉన్నతాధికారి. ఆయనకు ఇది సొంత శాఖ కూడా కాదు. డిప్యూటేషన్‌పై నియామకం. అయినా ఈయన చెప్పిందే కలెక్టరేట్లో వేదం. ఇతర శాఖలకు చెందిన కీలక ఫైళ్లు సైతం ఈయన పరిశీలించాకే జిల్లా సర్వోన్నతాధికారికి వెళ్తున్నాయి. బదిలీలు, పోస్టింగ్‌లు, కారుణ్య నియామకాలు ఏవైనా సరే ఆయనకు నజరానాలు ముడితేనే పని. జిల్లాస్థాయి అధికారులకు వెళ్లే రికార్డుల్లో ఏవైనా తప్పులుంటే కామెంట్ రాసి వాటిని కిందకు పంపుతారు. ఈ అంశాన్నే వసూల్ రాజా నగదుగా మలచుకుంటున్నాడు. రికార్డ్స లోపాలున్నాయని.. తనను సంతృప్తి పరిస్తే పనులు జరుగుతాయని డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏ నియామకానికైనా చేయి తడపాల్సిందే.. రెవెన్యూ ఇన్స్పెక్టరు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆపై పోస్టులకూ.. ఏ నియమాకాలకైనా చేయి తడపాల్సిందే. జిల్లాలో ఏ విభాగంలో నియామకాలు చేపట్టాలన్నా ఆయా విభాగాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో పాటు ఇతరులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆయా శాఖలపై ఎలాంటి పట్టులేకపోయినప్పటికీ ఈయనను మాత్రం ప్రతి కమిటీకి కన్వీనర్గానో, సభ్యునిగానో నియమిస్తుండటం గమనార్హం. ఇటీవల అంగన్వాడీ, సర్వశిక్షా అభియాన్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విభాగాల్లో జరిగిన నియామకాల్లోనూ వసూల్ రాజా చక్రం తిప్పాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేల నుంచి లక్షకుపైగా వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. జిల్లాస్థాయి అధికారులైనా ఆయన్ను కలవాల్సిందే.. జిల్లాస్థాయి అధికారులు సైతం ఆయనతో మాట్లాడాల్సిందే. వారి శాఖలకు సంబంధించిన ఏవైనా ఫైళ్లు ముందుకు కదలాలంటే ఆయన కరుణ తప్పదు. ఏ పని చేయించుకోవాలన్నా.. ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. బదిలీ, పోస్టింగ్, ఇతర ఏదైనా రికార్డు తయారైన తర్వాత సంబంధిత విభాగాల నుంచి ఉన్నతాధికారులకు వెళ్లాలి. కానీ, అలా జరగడం లేదు. కీలక శాఖలకు చెందిన ఫైళ్లన్నీ ఆయన పరిశీలించాకే సర్వోన్నతాధికారి వద్దకు చేరుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఉద్యోగులను పీడించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నా ఈ అధికారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. -
ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల్లో కోత
గతేడాది రూ.1.66 కోట్లు మంజూరు ఈ ఏడాది రూ.59.50 లక్షలు మాత్రమే విడుదల మార్చిలోగా ఖర్చుచేయాలని ఆదేశాలుదుర్వినియోగంఅయ్యేందుకు ఆస్కారం నెల్లూరు (టౌన్) : ప్రభుత్వం విద్యాశాఖపై చిన్నచూపు చూస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) విడుదల చేసే నిధుల్లో భారీగా కోత విధించింది. ఇప్పటికే ఎస్ఎస్ఏ (సర్వ శిక్ష అభియాన్) నిధులు జిల్లాకు అంతంతమాత్రంగా వస్తుండగా తాజాగా ఆర్ఎస్రాస్ఏ నిధుల్లోనూ కోత పెట్టడంతో పాఠశాలల్లో సదుపాయాలపై ప్రభావం పడనుంది. ఇచ్చిన కొద్ది నిధులు మార్చి నెలలోగా ఖర్చు చేయాలని చెప్పడంతో అవి నిజంగా విద్యార్థులకు ఉపయోగపడుతాయా అనేఅనుమానంవ్యక్తమవుతోంది. ఉన్నత పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు కేటాయిస్తారు. వాటిని టెలిఫోన్, విద్యుత్ చార్జీలు, తాగునీటి కోసం, సైన్స్ పరికరాలు, గ్రంథాలయ పుస్తకాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. జిల్లాలోని 356 సక్సెస్ పాఠశాలలకు 2015-16 సంవత్సరానికి గానూ రూ.59.50 లక్షలు నిధులు విడుదల చేశారు. గత సంవత్సరం రూ.1.66 కోట్లు విడుదల చేయగా ఈసారి బాగా తగ్గించారు. వాస్తవానికి నిధులు గత సంవత్సరం ఆగస్టులోనే విడుదల చేయాల్సి ఉన్నా ఆలస్యంగా ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతంలో ఒక్కో పాఠశాలకు రూ. 50 వేలు నిధులు ఇచ్చేవారు. అయితే ఈసారి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇవ్వాలనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో నిధుల్లో కోత పడినట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో నిధుల విడుదలలో భారీగా కొత పడింది. అలాగే సక్సెస్ స్కూల్స్ 371 ఉంటే 356 పాఠశాలలకు మాత్రమే నిధులు ఇచ్చారు. మిగిలిన 15 పాఠశాలలకు ఎందుకు విడుదల చేయలేదో అధికారుల వద్దే సమాధానం లేదు. గడువు తక్కువే: నిధులను ఆలస్యంగా విడుదల చేసిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేసేందుకు సమయం మాత్రం చాలా తక్కువ ఇచ్చిం ది. మార్చి నెలాఖరులోగా వినియోగించాలని చెప్పడంతో అవి సక్రమంగా ఖర్చవుతాయా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో పరీక్షల సీజన్ సమీస్తుండటంతో అధికారులు నిధులు ఎలా వినియోగిస్తున్నారే విషయాన్ని పట్టించుకొనే అవకాశం లేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో నిధుల దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలోనూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ప్రధానోపాధ్యాయులు నిధులను ఇష్టానుసా రం ఖర్చు చేసి యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించిన దాఖలాలు అనే కం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారు లు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే వచ్చిన కొద్దిపాటి నిధులు విద్యార్థులకు ఎంతమాత్రం ఉపయోగడవు. నిధుల విడుదల విషయంపై సాక్షి డీఈఓఆంజనేయుల్ని వివరణ కోరగా ఆయన నిధులు ఇటీవలే విడుదల చేసినట్లు చెప్పారు. -
నిద్రావస్థలో ఎస్ఎస్ఏ!
అనంతపురం ఎడ్యుకేషన్ : నిధులు పుష్కలంగా ఉన్న శాఖల్లో సర్వశిక్ష అభియాన్ ఒకటి. ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది జిల్లాలో ఎస్ఎస్ఏ పరిస్థితి. పర్యవేక్షణ లేకపోవడంతో నిద్రావస్థలో ఉంది. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా పది నెలలుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ లేరు. పీఏ పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సెక్టోరియల్ ఆఫీసర్లు, కార్యాలయంలో సిబ్బంది ఎవరికి వారే.. యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. నిధులు దండిగా ఉన్నా వాటిని ఖర్చు చేయించే అధికారి లేకపోవడంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతోంది. విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందడం లేదు. పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చు 2014-15 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్ఏ ద్వారా ఖర్చు చేసేందుకు రూ. 202 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వీటిలో రూ.83 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏడు నెలలు గడిచినా కేవలం రూ. 39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే ఈ శాఖ పర్యవేక్షణ ఎంత మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో కూడా పాఠశాల నిధులు, పాఠశాల అభివృద్ధి నిధులు, ఎమ్మార్సీ, కాంప్లెక్స్ నిధు లు సుమారు రూ. 6 కోట్లు ఎస్ఎస్ఏ నుంచి ఆయా ఖాతాల్లో జమ చేశారు. ఈ రూ.6 కోట్లు ఎస్ఎస్ఏ లెక్కలో ఖర్చు చేసినట్లే. కానీ ఈ నిధు ల్లో కూడా కనీసం రూ. రెండు కోట్లు కూడా ఖర్చు కాలేదు. ఇంకా నాలుగు కోట్లు ఆయా ఖాతాల్లో మూలుగుతున్నాయి. ఈ లెక్కన ఖర్చు చేసింది కేవలం రూ.35 కోట్లే. వచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే తర్వాత క్వార్టర్లో నిధుల విడుదలలో కోత విధిస్తారు. ఇప్పుడు ఖర్చు చేసిన నిధుల ఆధారంగా నిధులు తగ్గించి విడుదల చేస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వచ్చే నిధుల్లో భారీగా కోతపడడం ఖాయమని ఉపాధ్యాయులు, ఎస్ఎస్ఏ సిబ్బంది చెబుతున్నారు. అంతంతమాత్రంగానే కార్యక్రమాలు శాఖాధిపతి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న ఫిజియోథెరపీ క్యాంపులు, భవిత క్యాంపులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వైద్యులు ఉంటే సీఆర్టీలు ఉండరు. సీఆర్టీలు ఉంటే పిల్లలకు సమాచారం ఇవ్వరు. కేజీబీవీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలా కేజీబీవీల్లో అమ్మాయిలు మరుగుదొడ్లు, తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వాటిని పట్టించుకునే నాథుడే లేరు. జిల్లా వ్యాప్తంగా బడిబయట పిల్లలు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారంటూ ఎస్ఎస్ఏ అధికారులు ఇచ్చిన నివేదకతో ఇటీవల స్వయంగా కలెక్టరు మొట్టికాయలు వేశారు. పక్కా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పట్టించుకునే వారు లేకపోవడంతో ఊహ లెక్కలు తప్ప పక్కాగా ఎంత మంది ఉన్నారో గుర్తించలేని పరి స్థితి. డైస్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండడం లేదు. కేవలం పోస్టులు కాపాడుకునే క్రమంలో బోగస్ విద్యార్థుల సంఖ్యను చూపిస్తున్నారు. వీటిని పటించుకునే వారు లేరు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో సివిల్ వర్క్స్ నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల మరుగుదొడ్లు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలల్లో పనులు ప్రారంభం కాలేదు. పది నెలలుగా పీఓ లేరు గతంలో ఎస్ఎస్ఏ పీఓగా ఉన్న కేఎస్ రామారావు సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో ఫిబ్రవరిలో చిత్తూరుకు వెళ్లారు. అప్పటి నుంచి జిల్లా విద్యాఖ అధికారి మధుసూదన్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ వచ్చారు. ఈయన ఇటీవల బదిలీ కావడంతో డీఈగా జిల్లాకు వచ్చిన అంజయ్య ఎస్ఎస్ఏ పీఓగా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. డీఈఓ చాలా కార్యక్రమాలతో సతమతమవుతున్నారు. ఇక ఎస్ఎస్ఏ వ్యవహారాలను పరిశీలించే తీరిక ఉండడం లేదు. ఏదో వచ్చిన ఫైళ్లపై సంతకాలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు పర్యవేక్షించే తీరిక ఉండడం లేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులోనూ విద్యావేత్త అయిన పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు కుంటుపడుతున్నా...కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యంతో రెగ్యులర్ పీఓ నియామకం సమస్య కొలిక్కిరాలేదు. ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు స్పందించకపోతే వచ్చిన నిధులు కూడా వెనక్కు వెళ్లడం ఖాయం. -
పరిశీలన పూర్తయింది..
పాఠశాలలను సందర్శించిన 17 బృందాలు టాయిలెట్లు, నీటి సౌకర్యంపై ఆరా నివేదికలతో నేడు హైదరాబాద్‌కు... అవసరమైన పాఠశాలలకు ఎస్ఎస్ఏ నిధులు విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్షాభియాన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలన పూర్తయింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో టాయిలెట్లు ఉన్నాయా, ఉంటే నీటి సౌకర్యం ఎలా ఉంది, వినియోగంలో ఉన్నా యా, లేదా అని ఆరా తీశారు. ఇంజినీరిం గ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన 17 బృందాలు జిల్లాలోని అన్ని పాఠశాలలను స్వయంగా తనిఖీ చేశాయి. ఈ మేరకు తనిఖీల్లో తేలిన వివరాలతో నివేదిక రూపొందించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్లు, నీటి వసతి కల్పించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, పాఠశాలల్లోని వసతులపై నివేదిక సమర్పించాలని సూచించింది. ఇందుకు ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరిన విషయం విదితమే. ఈ మేరకు 17 బృందాలుగా ఏర్పడిన అధికారులు వారం రోజుల పాటు అన్ని మండలాల్లోని పాఠశాలలను పరిశీలించారు. జిల్లాలో పీఎస్, యూపీఎస్, హైస్కూళ్లు కలిపి 3,266 పాఠశాలలు ఉండగా, వీటిలో 57 పాఠశాలల్లో అసలు టాయిలెట్స్ లేవని వెలడైంది. అంతేకాకుండా 460 పాఠశాలల్లో ఒక్కో టాయిలెట్ మాత్రమే ఉన్నట్లు, 600నుంచి 700 పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నా నీటి వసతి లేకపోవడం వంటి కారణాలతో నిరుపయోగంగా మారినట్లు గుర్తించారు. ఆగస్టు 31లోగా వసతుల కల్పన పాఠశాలల తనిఖీలో భాగంగా అసలు టాయిలెట్స్ లేని పాఠశాలలను గుర్తించి న అధికారులు వాటికి రూ.35వేల చొప్పు న నిధులను గురువారం మంజూరు చేశా రు. అలాగే, ఒక్కో టాయిలెట్ ఉన్న పాఠశాలలకు మరొకటి మంజూరు చేశారు. అంతేకాకుండా ఉపయోగంలో లేని టాయిలెట్లను వినియోగంలోకి తీసుకురావాలని, దీనికోసం రన్నింగ్ వాటర్ లేకపోతే నీరు నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గతం లో 131 టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికారులు తాజాగా మంజూరు చేసిన అన్ని నిర్మాణాలను ఆగస్టు 31వతేదీ కల్లా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అంతేకాకుండా 400 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదని గుర్తించిన అధికారులు క్యాన్ల ద్వారా నీరు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. నేడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు తెలుసుకునేందుకు చేపట్టిన సర్వేపై హైదరాబాద్ శుక్రవారం సమీక్ష జరగనుంది. సర్వేలో వెల్లడైన అంశాలతో రూపొందిం చిన నివేదికతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు సర్వశిక్షాభియాన్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. -
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకూ ఇక ఎస్ఎస్ఏ యూనిఫాంలే
సాక్షి, ముంబై: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం యూనిఫారాలను అందజేయదు. వీరికి కూడా సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) పథకం ద్వారానే యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూనిఫారాలు అందజేయబోమని అందులో స్పష్టం చే సింది. అందుకుగల కారణాలను సంబంధిత అధికారి ఒకరు వివరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నిధులు వృథా అవుతున్నాయని, పథకం అమలులో చోటుచేసుకుంటున్న అవకతవకలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పా రు. సర్వశిక్షా అభియాన్ ఎస్సీ, ఎస్టీలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు యూనిఫారాల కోసం నిధులను 2010 నుంచే అందజేస్తోందని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయిస్తున్నాయని, దీంతో మరో పథకం ద్వారా ప్రత్యేకించి యూనిఫారాల కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం లేకుండా ఎస్ఎస్ఏ ద్వారానే ఎస్సీ, ఎస్టీలకు యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించిందన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్-2009 ప్రకారం ఎస్ఎస్ఏ ఏర్పాటైంది. దీనిలోభాగంగా ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారాల కోసం రూ.400 అందజేస్తారు. ఇక నుంచి ఈ పద్ధతినే ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేయనున్నారు. పెదవి విరుస్తున్న ప్రధానోపాధ్యాయులు... ఎస్ఎస్ఏలో భాగంగా యూనిఫారాల కోసం ఇస్తున్న రూ.400 ఎటూ సరిపోవడంలేదని జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ఒక జత యూనిఫారానికి రూ. 200 ఇవ్వడంవల్ల నాసిరకం దస్తులతోనే విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. యూనిఫారాల డబ్బులు కూడా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయడం ద్వారా అవి సద్వినియోగం అయ్యే అవకాశం లేదని, నేరుగా దుస్తులు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ పథకమే బాగుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధికారి అనిల్ బోర్నారే వ్యక్తం చేశారు.