డీఈఓ ఆఫీస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల విభజన | deo, ssa jobers vibajana | Sakshi
Sakshi News home page

డీఈఓ ఆఫీస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల విభజన

Published Tue, Sep 27 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

డీఈఓ ఆఫీస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల విభజన

డీఈఓ ఆఫీస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల విభజన

  • కలిపేసి సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపు
  • పలువురు ఉద్యోగుల ఆందోళన
  • విద్యారణ్యపురి : హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఉద్యోగులు, సర్వశిక్షాభియాన్(ఎస్‌ఎస్‌ఏ) జిల్లా ప్రాజెక్టు ఉద్యోగులను కలిపి సీనియారిటీ ప్రాతిపదికన నాలు గు జిల్లాలకు కేటాయించారు. దీంతో కొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఈఓ కార్యాలయం, ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్లను ఈనెల 26న రాత్రి డీఈఓ పీ.రాజీవ్‌ తన చాంబర్‌లోకి పిలిచి సీనియార్టీ ప్రతిపదికన పిలిచి జిల్లాలకు కేటాయించారు. అంతకుముందే సూపరింటెండెంట్లు 8 మందిని కూడా కలిపి సీనియార్టీ ప్రకారం కేటాయించారు. వరంగల్‌ జిల్లాను భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్విభజన చేస్తున్న విషయం తెలిసిందే. డీఈఓ కార్యాలయంలోని 14 సీనియర్‌ అసిస్టెంట్లతోపాటు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్‌ అసిస్టెంట్లు కూడా కలుపగా మొత్తం 21మంది సీనియర్‌ అసిస్టెంట్లతో సీనియార్టీ రూపొందించి వారిని జిల్లాలకు కేటాయిం చారు. దీంతో పలువురు ఎస్‌ఎస్‌ఏలోని సీనియర్‌ అసిస్టెంట్లు తమను ఎలా డీఈఓ కార్యాలయం ఉద్యోగులతో కలిపి సీనియా ర్టీ రూపొందిస్తారని, దీంతో తాము భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని పలువురు డీఈఓ పి.రాజీవ్‌తో వాగ్వాదానికి ది గారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ మౌఖిక ఆదేశాలతోనే కలిపి సీనియారిటీ ప్రాతిపదికను జిల్లాలకు కేటాయిస్తున్నామని డీఈవో పేర్కొన్నారు.
     
    అసలు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టును డీఈవో పరిధిలోకి విలీనం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదని, ఆ రెండుశాఖల ఉద్యోగులను కలిపి సీనియారిటీ రూపొం దించాలని కూడా ఉత్తర్వులు రాలేదని, అయినా ఇలా ఎలా కేటాయిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఎస్‌ఎస్‌ఏను డీఈఓ పరిధిలోకి చేర్చినా కూడా అందులో పని చేసే వారిని సీనియార్టీ ప్రకారంగానే జిల్లాలకు కేటాయించాలని అన్నారు. ఈమేరకు పలువురు మహిళా ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌ ను విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నా రు. ఈ విషయంపై మంగళవారం ‘సాక్షి’ డీఈవో పి.రాజీవ్‌ను వివరణ కోరగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ మౌఖిక ఆదేశాల మేరకు రెండు రకాలుగా ఉద్యోగులను విభజించి జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికను కేటాయిస్తూ వారి పేర్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయిస్తూ ఒక జాబితా, డీఈఓ కార్యాలయం, ఎస్‌ఎస్‌ఏలోని ఉద్యోగులను కలిపి సీని యార్టీ ప్రతిపదికన మరో జాబితా రూపొం దించి ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలి పారు. వీటిలో దేన్ని అమలు చేస్తారో వేచి చూడాలని తెలిపారు. పలుమార్లు వీడియో కాన్ఫరెన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టును డీఈవో పరిధిలోకే విలీనం చేస్తారని చెప్పారని పేర్కొన్నారు. అందుకే రెండూ కలిపి సినియారిటీ ప్రాతిపదిన కేటాయించామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement