ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల్లో కోత
గతేడాది రూ.1.66 కోట్లు మంజూరు
ఈ ఏడాది రూ.59.50 లక్షలు మాత్రమే విడుదల
మార్చిలోగా ఖర్చుచేయాలని ఆదేశాలుదుర్వినియోగంఅయ్యేందుకు ఆస్కారం
నెల్లూరు (టౌన్) : ప్రభుత్వం విద్యాశాఖపై చిన్నచూపు చూస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) విడుదల చేసే నిధుల్లో భారీగా కోత విధించింది. ఇప్పటికే ఎస్‌ఎస్‌ఏ (సర్వ శిక్ష అభియాన్) నిధులు జిల్లాకు అంతంతమాత్రంగా వస్తుండగా తాజాగా ఆర్‌ఎస్‌రాస్‌ఏ నిధుల్లోనూ కోత పెట్టడంతో పాఠశాలల్లో సదుపాయాలపై ప్రభావం పడనుంది. ఇచ్చిన కొద్ది నిధులు మార్చి నెలలోగా ఖర్చు చేయాలని చెప్పడంతో అవి నిజంగా విద్యార్థులకు ఉపయోగపడుతాయా అనేఅనుమానంవ్యక్తమవుతోంది.
ఉన్నత పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు కేటాయిస్తారు. వాటిని టెలిఫోన్, విద్యుత్ చార్జీలు, తాగునీటి కోసం, సైన్స్ పరికరాలు, గ్రంథాలయ పుస్తకాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. జిల్లాలోని 356 సక్సెస్ పాఠశాలలకు 2015-16 సంవత్సరానికి గానూ రూ.59.50 లక్షలు నిధులు విడుదల చేశారు. గత సంవత్సరం రూ.1.66 కోట్లు విడుదల చేయగా ఈసారి బాగా తగ్గించారు. వాస్తవానికి నిధులు గత సంవత్సరం ఆగస్టులోనే విడుదల చేయాల్సి ఉన్నా ఆలస్యంగా ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతంలో ఒక్కో పాఠశాలకు రూ. 50 వేలు నిధులు ఇచ్చేవారు. అయితే ఈసారి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇవ్వాలనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో నిధుల్లో కోత పడినట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో నిధుల విడుదలలో భారీగా కొత పడింది. అలాగే సక్సెస్ స్కూల్స్ 371 ఉంటే 356 పాఠశాలలకు మాత్రమే నిధులు ఇచ్చారు. మిగిలిన 15 పాఠశాలలకు ఎందుకు విడుదల చేయలేదో అధికారుల వద్దే సమాధానం లేదు.
గడువు తక్కువే: నిధులను ఆలస్యంగా విడుదల చేసిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేసేందుకు సమయం మాత్రం చాలా తక్కువ ఇచ్చిం ది. మార్చి నెలాఖరులోగా వినియోగించాలని చెప్పడంతో అవి సక్రమంగా ఖర్చవుతాయా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో పరీక్షల సీజన్ సమీస్తుండటంతో అధికారులు నిధులు ఎలా వినియోగిస్తున్నారే విషయాన్ని పట్టించుకొనే అవకాశం లేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో నిధుల దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలోనూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ప్రధానోపాధ్యాయులు నిధులను ఇష్టానుసా రం ఖర్చు చేసి యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించిన దాఖలాలు అనే కం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారు లు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే వచ్చిన కొద్దిపాటి నిధులు విద్యార్థులకు ఎంతమాత్రం ఉపయోగడవు. నిధుల విడుదల విషయంపై సాక్షి డీఈఓఆంజనేయుల్ని వివరణ కోరగా ఆయన నిధులు ఇటీవలే విడుదల చేసినట్లు చెప్పారు.