rmsa
-
కేంద్ర నిధులు...తెలంగాణకే ముందు!
సాక్షి, హైదరాబాద్: సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ),రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ కింద తెలంగాణకే ముందుగా కేంద్ర నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో ఇచి్చన రూ. 382 కోట్లకు సకాలంలో రాష్ట్ర విద్యాశాఖ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇవ్వడంతో ఈసారి మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణకే రెండో విడత నిధులు ఇచి్చంది. రెండో విడత కింద రూ.452.62 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో తమ వాటా నిధులు రూ. 301.75 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. విద్యాశాఖలో మధ్యాహ్న భోజనం, విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల భవన నిర్మాణాలు తదితర కార్యక్రమాలకు (కేంద్ర ప్రాయోజిత పథకాలు) కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వేంచించాల్సిఉంది. గతంలో మొదటి విడత నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసేది. దీంతో విద్యాశాఖ కేంద్రానికి సకాలంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రెండో విడత నిధులు సకాలంలో వచ్చేవి కావు. అయితే ఈసారి రాష్ట్రం తమ మొదటి విడత వాటా నిధులను సకాలంలో విడుదల చేయడంతో కేంద్రం రెండో విడత నిధులను కూడా ఇచి్చంది. దీంతో సమగ్ర శిక్షా అభియాన్, రాష్రీ్టయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 834.62 కోట్లు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. -
సమగ్ర శిక్షాభియాన్
సాక్షి, రాయవరం (మండపేట): సాధారణంగా ఒకటో తేదీన వేతనాలు పొందాలని ఉద్యోగులు ఆశిస్తారు. అయితే ఒకటో తేదీన వేతనాలు రాకపోవడంతో ఏమైందో తెలియక ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఆరా తీస్తే వారి హెడ్ ఆఫ్ అకౌంట్‌ను సీఎఫ్ఎంఎస్ నుంచి తొలగించినట్లు తెలిసింది. దీంతో తమకు వేతనాలు ఎలా వస్తాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి పైగా మార్చి నెలలో వేతనాలు నిలిచిపోయాయి. సమగ్ర శిక్షాభియాన్‌లో ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులను మిళితం చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్య ఎలా వచ్చిందంటే... ఇప్పటి వరకు సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, రాష్ట్ర విద్యా పరిశోధనామండలి (ఎస్సీఈఆర్టీ) విడివిడిగా వాటి కార్యకలాపాలు నిర్వహించేవి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వస్తూ సమగ్ర శిక్షాభియాన్గా మార్పు చేస్తూ గతేడాది ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందుకు అనుగుణంగా విద్యాశాఖ అవసరమైన నిర్ణయాలను తీసుకోనట్టు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏకు నిధులు కేటాయించక పోవడంతో సీఎఫ్ఎంఎస్ నుంచి ఆర్‌ఎంఎస్‌ఏ హెడ్ ఆఫ్ అకౌంట్‌ను ఫైనాన్స్ అధికారులు తొలగించారు. ఈ సమయంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరి అవలంబించడం వల్ల సమస్య ఉత్పన్నమైందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 10వేల మందికి పైగా ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా ప్రతి ఉన్నత పాఠశాలకు రెండు మూడు ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయ పోస్టులు ఉండేలా క్రియేట్ చేశారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి పైగా నియమితులై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికిపైగా ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు నిలిచిపోయాయి. మార్చి నెల వేతనాలు ఏప్రిల్ ఒకటిన పొందాల్సి ఉంది. పాఠశాలల్లో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులకు వేతనాలు వారి ఖాతాల్లో జమ కాగా వీరికి మాత్రం ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయుల వేతనాలు ఇప్పించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు రాలేదు... మార్చి నెల వేతనాలు ఖాతాలకు జమ కాలేదు. దీంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. వేతనాలు మంజూరు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశాను. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. – కాళిదాసు గంగాధరరావు, ఆర్‌ఎంఎస్‌ఏ టీచర్, నరేంద్రపురం, రాజానగరం మండలం ఆర్థిక శాఖ దృష్టికి తీసుకుని వెళ్లాం ఆర్‌ఎంఎస్‌ఏ కింద పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల విషయమై ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్‌కుమార్ దృష్టికి తీసుకుని వెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి. – కేఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్, కాకినాడ, తూ.గో.జిల్లా -
చతికిల'బడి'
అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) పథకం కింద విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.15వేల నుంచి రూ.50 వేలు మంజూరయింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించక మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికి తోడు ఎస్ఎస్ఏ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.900 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాను కలిపి జిల్లాలకు కేటాయింపులు చేయాల్సి ఉన్నా నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. జిల్లాలో 2,773 ప్రాథమిక, 590 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. స్టేషనరీ, రిజిస్టర్లు, క్వశ్చన్ పేపర్లు, చాక్‌పీస్, లైబ్రరీ పుస్తకాల కొనుగోలుకు స్కూల్ గ్రాంట్, కరెంటు బిల్లుల చెల్లింపు, చిన్న చిన్న రిపేరీలు, స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు మెయింటెనెన్స్ గ్రాంట్‌ను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ విడుదల చేయకపోవడం గమనార్హం. ఊసే లేని స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకునెలకో సమావేశం నిర్వహించాలి. బోధన, ఇతరత్రా అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారు. నిధుల లేమితో ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. పర్యవేక్షించాల్సిన ఎస్ఎస్ఏ అధికారులు బడ్జెట్ లేని కారణంగా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. పైగా గతేడాది నిర్వహించిన సమావేశాలలకు నేటికీ చాలా కాంప్లెక్స్‌లకు బిల్లులు రాలేదని తెలుస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణ దారుణం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్ఎస్ఏ నిధులపైనే ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు మంజూరు చేసింది. దీంతో వారికి కాస్త ఉపశమనం కలిగింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణ మాత్రం దారుణంగా తయారైంది. ప్రధానోపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. వారికి పైసా కూడా ఎలాంటి నిధులు రాకపోవడంతో చేతి నుంచి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు రూ.20–30 వేలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలు రూ.10–15 వేలు ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. పట్టించుకోని ప్రభుత్వం పాఠశాలల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం.. చాక్‌పీస్ కొనేందుకూ డబ్బులు లేకపోయినా పట్టించుకోవట్లేదని హెచ్ఎంలు వాపోతున్నారు. కనీస అవసరాలకు ఉపయోగించాల్సి నిధులను కూడా రిలీజ్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. మురిగిపోయిన రూ.3 కోట్లు అధికారుల అలత్వంతో రూ.3 కోట్ల నిధులు మురిగిపోయాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘పాఠశాలల నిర్వహణ నిధులు’ పైసా కూడా కేటాయించలేదు. ఎస్ఎస్ఏ అధికారులు పంపిన వార్షిక ప్రణాళిక ఆధారంగానే నిధుల కేటాయింపు జరుగుతుంది. పాఠశాల నిర్వహణ నిధులను ప్రణాళికలో పెట్టకుండానే ఆమోదముద్ర వేయించుకున్న పాపానికి ఆ నిధులు జిల్లాకు చేరని పరిస్థితి. ‘అనంత’ జిల్లా మినహా తక్కిన అన్ని జిల్లాలకూ ఈ నిధులు విడుదలయ్యాయి. అధికారులు, ప్రజాప్రనిధులు పట్టించుకోలేదు గతేడాదికి సంబంధించిన స్కూల్ గ్రాంటు జిల్లాకు రూపాయి కూడా రాలేదు. నిర్వహణకు హెచ్ఎంలు చాలా ఇబ్బంది పడ్డారు. కరువు జిల్లాను నిర్లక్ష్యం చేశారంటూ ఉపాధ్యాయ సంఘాల తరఫున అధికారులు, ప్రజానిధులను కలిశాం. ఫలితం లేదు. ఆర్నెల్లయినా రూపాయి కూడా రాలేదు.– బి.నరసింహులు, హెచ్ఎం రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ చేతి నుంచి పెట్టుకుంటున్నాం స్కూల్ గ్రాంటు, మెయింటెనెన్స్ గ్రాంటు రూపాయి కూడా రాలేదు. నిర్వహణకు చాలా ఖర్చు వస్తోంది. ఎవరిని అడగాలి. చేతి నుంచి పెట్టుకుంటున్నాం. ఉన్నత పాఠశాలలకైనా ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు వచ్చి కాస్తా ఉపశమనం కలిగింది. ప్రాథమిక, యూపీ స్కూళ్ల నిర్వహణ మరీ భారంగా మారింది.– హెచ్.గురుప్రసాద్, హెచ్ఎం బీడుపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసమే స్కూళ్లు తెరెచి ఆర్నెల్లయినా రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వ బడులంటే చంద్రబాబుకు చులకన.– కె.ఓబుళపతి, వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వాలీబాల్ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట విద్యార్థులు
విస్సన్నపేట : ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో వాలీబాల్ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట జిల్లాపరిషత్ హైస్కూల్ విద్యార్థులు ముగ్గురు ఎంపికైనట్లు పీఈటీ రమేష్ శుక్రవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుంచి కడప జిల్లా రాజంపేటలో జరిగే రాష్ట్ర వాలీబాల్ పోటీల్లో ఆడనున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను హెచ్ఎం అరుణ అభినందించారు. -
ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల్లో కోత
గతేడాది రూ.1.66 కోట్లు మంజూరు ఈ ఏడాది రూ.59.50 లక్షలు మాత్రమే విడుదల మార్చిలోగా ఖర్చుచేయాలని ఆదేశాలుదుర్వినియోగంఅయ్యేందుకు ఆస్కారం నెల్లూరు (టౌన్) : ప్రభుత్వం విద్యాశాఖపై చిన్నచూపు చూస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) విడుదల చేసే నిధుల్లో భారీగా కోత విధించింది. ఇప్పటికే ఎస్ఎస్ఏ (సర్వ శిక్ష అభియాన్) నిధులు జిల్లాకు అంతంతమాత్రంగా వస్తుండగా తాజాగా ఆర్ఎస్రాస్ఏ నిధుల్లోనూ కోత పెట్టడంతో పాఠశాలల్లో సదుపాయాలపై ప్రభావం పడనుంది. ఇచ్చిన కొద్ది నిధులు మార్చి నెలలోగా ఖర్చు చేయాలని చెప్పడంతో అవి నిజంగా విద్యార్థులకు ఉపయోగపడుతాయా అనేఅనుమానంవ్యక్తమవుతోంది. ఉన్నత పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు కేటాయిస్తారు. వాటిని టెలిఫోన్, విద్యుత్ చార్జీలు, తాగునీటి కోసం, సైన్స్ పరికరాలు, గ్రంథాలయ పుస్తకాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. జిల్లాలోని 356 సక్సెస్ పాఠశాలలకు 2015-16 సంవత్సరానికి గానూ రూ.59.50 లక్షలు నిధులు విడుదల చేశారు. గత సంవత్సరం రూ.1.66 కోట్లు విడుదల చేయగా ఈసారి బాగా తగ్గించారు. వాస్తవానికి నిధులు గత సంవత్సరం ఆగస్టులోనే విడుదల చేయాల్సి ఉన్నా ఆలస్యంగా ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతంలో ఒక్కో పాఠశాలకు రూ. 50 వేలు నిధులు ఇచ్చేవారు. అయితే ఈసారి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇవ్వాలనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో నిధుల్లో కోత పడినట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో నిధుల విడుదలలో భారీగా కొత పడింది. అలాగే సక్సెస్ స్కూల్స్ 371 ఉంటే 356 పాఠశాలలకు మాత్రమే నిధులు ఇచ్చారు. మిగిలిన 15 పాఠశాలలకు ఎందుకు విడుదల చేయలేదో అధికారుల వద్దే సమాధానం లేదు. గడువు తక్కువే: నిధులను ఆలస్యంగా విడుదల చేసిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేసేందుకు సమయం మాత్రం చాలా తక్కువ ఇచ్చిం ది. మార్చి నెలాఖరులోగా వినియోగించాలని చెప్పడంతో అవి సక్రమంగా ఖర్చవుతాయా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో పరీక్షల సీజన్ సమీస్తుండటంతో అధికారులు నిధులు ఎలా వినియోగిస్తున్నారే విషయాన్ని పట్టించుకొనే అవకాశం లేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో నిధుల దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలోనూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ప్రధానోపాధ్యాయులు నిధులను ఇష్టానుసా రం ఖర్చు చేసి యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించిన దాఖలాలు అనే కం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారు లు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే వచ్చిన కొద్దిపాటి నిధులు విద్యార్థులకు ఎంతమాత్రం ఉపయోగడవు. నిధుల విడుదల విషయంపై సాక్షి డీఈఓఆంజనేయుల్ని వివరణ కోరగా ఆయన నిధులు ఇటీవలే విడుదల చేసినట్లు చెప్పారు. -
డిజిటల్ చదువులు
- ప్రభుత్వ పాఠశాలల్లో దృశ్యశ్రవణంతో విద్యాబోధన - ఈ నెలాఖరునుంచి అమలుకు విద్యాశాఖ నిర్ణయం - ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు - ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి రూ.50వేల చొప్పున నిధులు - రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో అమలు తాండూరు ఎలక్ట్రాన్లు..ప్రోటాన్లు..న్యూట్రాన్లతో పరమాణువు నిర్మాణం గురించి ఉపాధ్యాయుడు బోధించినా అర్థంకాక పుస్తకాలతో విద్యార్థులు కుస్తీ పట్టే పనిలేదు. గుండె ఎలా పనిచేస్తుంది...దాని నిర్మాణం..రక్తం గుండెకు ఎలా చేరుతుంది...శరీరంలోని మిగతా భాగాలకు ఎలా పంపిస్తుందో బుర్రకు ఎక్కక జుట్టుపీక్కునే పరిస్థితి ఉండదు. పాఠ్యాంశాలను బట్టీ పట్టాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి విముక్తి కల్పించి...సులువుగా, ఆసక్తికరమైన బోధనలతో విద్యార్థుల అవగాహన పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తుం ది. దృశ్యశ్రవణం ద్వారా ఉత్సాహవంతమైన వాతావరణంలో విద్యార్థుల నైపుణ్యత పెంచి, ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు నడుం బిగించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యాప్రమాణాలు, విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు జిల్లా విద్యాశాఖ కొత్తగా ప్రొజెక్టర్లతో ‘డిజిటల్ క్లాస్’ల విధానం అమలుకు సిద్ధమైంది. ]రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల చివరి నుంచి డిజిటల్ క్లాస్‌లను జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 480 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాల్లో డిసెంబర్ చివరికి డిజిటల్ క్లాస్‌లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డీఈఓ రమేష్ ఆదేశాలిచ్చారు. డిజిటల్ క్లాస్‌ల బోధనకు పాఠశాలల్లో ప్రత్యేకంగా ప్రొజెక్టర్లు, స్క్రీన్లతోపాటు అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి రూ.50వేల చొప్పున నిధులను డీఈఓ కేటాయించారు. తెలుగు, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం తదితర సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విద్యార్థులకు దృశ్యశ్రవణం ద్వారా బోధిం చనున్నారు. ముఖ్యంగా ఆయా సబ్జెకుల్లో కష్టతరమైన పాఠ్యాంశాలను డిజిటల్ క్లాస్‌లో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా దృశ్యాల రూపంలో చూపిస్తూ, ఇందు కు అవసరమైన వివరాలు ఆడియో(శ్రవణం) ద్వారా తెలియజేస్తారు. దీంతో తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానికంటే విద్యార్థులకు ఎంత కఠినమైన పాఠ్యాంశమైనా కదిలే దృశ్యాల ద్వారా బాగా అర్థమవుతుందని, అవగాహన, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ క్లాసుల్లో చూసి న, విన్న పాఠ్యాంశాలను విద్యార్థులు ఎంత కాలమైనా వాటిని మరిచిపోయే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాల్లో విద్యాప్రమాణాలు మరింత పెరుగుపడతాయనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. సబ్జెకుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలను జిల్లా అధికారులు రూపొందిస్తున్నారని చెబుతున్నారు. నెలాఖరునుంచి.. ఉన్నత పాఠశాలల్లో కొత్తగా డిజిటల్ క్లాసులను బోధించాలని డీఈఓ నుంచి ఆదేశాలున్నాయి. ఈ నెల చివరి నాటికి అమలు చేయాలని జిల్లా అధికారులు చెప్పారు. విద్యార్థుల నైపుణ్యత, సామర్థ్యాలు పెంచడమే ఈ విధానం లక్ష ్యం. - వెంకటయ్య,హెచ్ఎం, తాండూరు ప్రాక్టికల్‌గా చూపిస్తాం గుండె ఎలా పనిచేస్తుందో తరగతిలో చెప్పిన దానికంటే దృశ్యాలతో ప్రాక్టికల్‌గా విద్యార్థులకు చూపించడం వల్ల అవగాహన స్థాయి పెరుగుతుంది. డిజిటల్ క్లాస్‌లతో విద్యార్థులు సులువుగా పట్టు సాధించేందకు దోహదపడుతుంది. -వాసుదేవ్, టీచర్,తాండూరు పాఠాలు మరిచిపోం... ఆడియో, వీడియో ద్వారా పాఠాలు సులువుగా అర్థమవుతాయి. ముఖ్యంగా సామాన్య శాస్త్రా నికి సంబంధించిన పాఠ్యాంశాలు మరిచిపోకుండా డిజిటల్ క్లాస్‌ల బోధన ఉపయోగపడుతుంది. -మణిచందన, 10వ తరగతి, పగిడ్యాల్ బట్టీకి చెక్ దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల బోధనతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠ్యాంశాలను బట్టీ పట్టాల్సిన అవసరముండదు. డిజిటల్ క్లాసులవల్ల పాఠాలు మదిలో గుర్తుండిపోతాయి. -నర్సింహులు, విద్యార్థి, పగిడ్యాల్ -
అప్పుల కుప్పలు.. కాంట్రాక్టర్ల తిప్పలు
ప్రొద్దుటూరు : జిల్లాలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పనుల తీరు దయనీయంగా మారింది. గతంలో రెండు మార్లు చిన్న మొత్తాల్లో పనులు చేసిన ఆర్‌ఎంఎస్‌ఏ గత ఏడాది మొత్తం రూ.65 కోట్లతో 144 పనులు చేపట్టింది. భవనాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం చొప్పున చెల్లిస్తోంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు ల్యాబ్ గదుల నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రకారంగా మొత్తం 144లో నిధుల సమస్య కారణంగా 98 పనులు ప్రారంభించారు. వీటిలో 69 పనులకు మాత్రమే తొలివిడతగా నిధులు మంజూరయ్యాయి. మిగత భవనాలకు రూపాయి కూడా మంజూరు కాలేదు. 36 భవన నిర్మాణాలు తుది మెరుగు దశలో ఉండగా, 13 భవనాలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి భవనాలను అప్పగించాల్సి ఉంది. అయితే ఇంత వరకు రూ.65 కోట్లకుగాను రూ.19 కోట్ల వరకు మాత్రమే నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించిన తర్వాత మూడు దశల్లో మొత్తం డబ్బు చెల్లిస్తామని అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నిర్మాణాలు ప్రారంభించిన వాటితోపాటు పూర్తయిన వాటికి కూడా ఇంత వరకు డబ్బు మంజూరు కాకపోవడం గమనార్హం. విద్యాశాఖ కదా అని ఎంతో ఆసక్తితో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. అయితే నిధుల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ఈ పనులను నమ్ముకుని తాను ఇంటిలోని బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని ఓ కాంట్రాక్టర్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో బుద్ధి ఉంటే ఆర్‌ఎంఎస్‌ఏ పనులు చేయనని తెలిపారు. బిల్లుల చెల్లింపు ఇంత అధ్వానంగా ఉంటుందనుకోలేదన్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంపై ఇటీవల కడపకు వచ్చిన ఆర్‌ఎంఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ సంధ్యారాణిని కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. వారం లోపు నిధులు మంజూరవుతాయని చెప్పినా ఇంత వరకు మంజూరు కాలేదు. పైగా చుట్టుపక్కల జిల్లాల కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు మంజూరైన విషయాన్ని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తాము ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 3వ విడత కింద ఈ పనులు జరుగుతుండగా ఐదేళ్ల క్రితం జరిగిన తొలివిడతలో చేపట్టిన 88 వర్క్లకుగాను రూ.35లక్షలు, రెండేళ్ల క్రితం జరిగిన రెండో విడత కింద చేపట్టిన 12 పనులకు ఇంకా రూ.45 లక్షలు కాంట్రాక్టర్లకు డిపార్ట్మెంట్ చెల్లించాల్సి ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాము నిండా మునగడం ఖాయమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మో.. ఆ పనులా!
ఏలూరు :ప్రస్తుత విద్యా సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి కొత్త విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే పరిస్థితి కనిపించటం లేదు. పుష్కలంగా నిధులున్నా.. నిర్మాణాలు చేపట్టేందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో 148 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) మూడో దశ కింద పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ. 48.33 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు 2013 నవంబర్‌లో జీవో నంబర్-64 విడుదలైంది. ఈ పనులకు సంబంధించి నేటివరకూ ఒక్క పాఠశాలలోనూ పునాది రాయి పడలేదు. ఈ పనుల ఆధారంగానే సాంఘిక సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు జీతాలు విడుదలవుతుం టాయి. పనులు ప్రారంభం కాకపోవడంతో ఏమిటీ వింత పరిస్థితి అని ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు. టెండర్లు రాలేదు మరి జిల్లాలో 145 జెడ్పీ హైస్కూళ్లు, మూడు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో తరగతి గదుల నిర్మాణానికి రూ.48.33 కోట్లు నిధులొచ్చాయి. ఈ పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నిన్నమొన్నటి వరకూ ఇసుక కొరత ఇబ్బంది పెట్టింది. తాజాగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఈ కారణాల వల్ల కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఒక్క తరగతి గది నిర్మాణానికైనా టెండర్లు దాఖలు కాలేదు. ఒక్కొక్క పని విలువ రూ.15 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉంది. చాలా పనులకు రెండు నుంచి నాలుగుసార్లు టెండర్లు ఆహ్వానించారు. ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో వచ్చే విద్యాసంవత్సరంలో అయినా పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణం మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
లెక్కల్లో అన్నీ.. పరికరాలే కొన్ని..!
పాలమూరు, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్.. కాకిలెక్కల పథకంలా మారింది. ప్రభుత్వ బడుల్లో గ్రంథాలయ పుస్తకాలు, ప్రయోగశాలల ఏర్పాటు తదితరాలు సమకూర్చి విద్యా ప్రమాణాలను పెంచడం.. రేపటి పౌరులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘ఆర్‌ఎంఎస్‌ఏ’ అమలు అధ్వానమవుతోంది. గతంలో ఈ పథకం ద్వారా 6,7,8 తరగతుల విద్యార్థులకోసం ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికీ చూపడం విశేషం. ఇప్పటి వరకు రూ.6.29 కోట్లు మంజూరై వాటిని వినియోగించినప్పటికీ.. పాఠశాలల్లో ఎక్కడా అంత మొత్తానికి తగ్గా పరికరాలుగాని, వస్తువులుగానీ కనపించడం లేదు. భవనాల నిర్మాణంతోపాటు పరికరాలు, ఇతరత్రా నిధులపై ఆజమాయిషీ లేకపోవడంతో కిందిస్థాయిలో ఆడిందే ఆటగా మారింది. నిధుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఏటా ఉద్యోగోన్నతులు, బదిలీలు, ఉద్యోగ విరమణ వంటి సమయాల్లో నోడ్యూస్ పత్రాలను తీసుకోక పోవడం, రికార్డుల నిర్వహణలో అవకతవకలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిధుల విడుదల ఇలా..! 2009-10లో 590 పాఠశాలలకు రూ.7,425 వంతున రూ.43.80లక్షలు ఇచ్చారు. ఇందులో దాదాపు 25 పాఠశాలల నుంచి వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇంకా ఇవ్వలేదు. 2010-11లో రూ.34,250 వంతున 590 పాఠశాలలకు రూ.2.02కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులను ఖర్చు పెట్టిన 45 పాఠశాలల నుంచి యూసీలు రాలేదు. 2011-12లో 590 పాఠశాలలకు రూ. 50వేల వంతున రూ.2,95 కోట్లు ఇచ్చారు. ఇంకా 60 పాఠశాలల నుంచి నిధులను ఖర్చు పెట్టినట్లు వినియోగతపత్రం ఇవ్వలేదు. 2012-13లో 590 పాఠశాలలకు రూ. 15వేల వంతున రూ. 88.50లక్షలు కేటాయించగా.. 2013-14కు గాను రూ.55 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన నిధుల వినియోగంపై ఎటువంటి సమాచారం లేదు. ఖర్చులకు లెక్కే లేదు..! ప్రయోగ శాలలకు ఇచ్చిన నిధులతో గణితం, సామాన్య శాస్త్రం పరికరాలు కొనుగోలు చేయడానికి నిర్దేశిత కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిందే. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక కిట్ ఉండాలి. వీటిలో రూ.20-30వేల వరకు వెచ్చించారు. ఆర్వీఎంలో 6-8 వరకు ప్రయోగశాలలకు నిధులు ఇచ్చారు. దాదాపుగా రూ. 25వేలను కేటాయించారు. చాలా వరకు కొనుగోలు చేశారు. అయినా ఈ కోటా నిధులు ఇవ్వడంతో వాటిని మళ్లీ చూపించే అవకాశం ఉంది. అలాగే చేస్తున్నారని సమాచారం. పుస్తకాల కొనుగోలులో తెలుగు అకాడమీ సూచించిన 23 రకాల పుస్తకాలు, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ, ఎన్సీఈఆర్టీ సూచించిన ఇరవై రకాల పుస్తకాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఆర్వీఎంలో కొనుగోలు చేసిన పుస్తకాలను ఈ పథకంలో చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కంప్యూటర్ విద్యకు ఐఈజీ (ఈ-గవర్నెన్స్)తో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. అయినా మళ్లీ ఇంటర్ నెట్ పెట్టుకోవడానికి ఈ పథకంలో అవకాశం ఇవ్వడంతో నిధుల దుబారాకు అవకాశం కలిగినటై ్లంది. -
ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు ఆగమాగం
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ ) నిధులు ఆగమాగం అవుతున్నాయి. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం అవసరమున్న చోట ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిధులు ఖజానాలో మూలుగుతున్నా అధికారులు మాత్రం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 150 ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద రూ. 3 కోట్లు మంజూరై రెండేళ్లు గడిచింది. ఒక్కో పాఠశాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు, శిథిలావస్థలో ఉన్న గదులు, ఫర్నిచర్‌కు మరమ్మతులు చేయించాలి. ఫ్యాన్లు, ట్యూబ్లైట్ల వంటి చిన్నచిన్న వసతులను ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఏటా జిల్లాకు రూ.కోట్ల నిధులు వస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. 150 పాఠశాలలకు ఈ నిధులు విడుదలైతే 110 పాఠశాలలకు మాత్రమే ఖర్చు చేసేందుకు ఇటీవల ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల పేరుతో అధికారులు కాలయాపన చేయడంతో పాఠశాలల్లో ఇప్పటికే అధ్వానంగా గదులు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు ఈ నిధులు ఉన్న విషయం కొందరు ప్రధానోపాధ్యాయులకే తెలియకపోవడం గమనార్హం. నిధుల విడుదల గురించి తెలిసిన హెచ్ఎంలు ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కమీషన్ల వేట.. రాజీవ్ విద్యామిషన్, ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా విడుదలైన నిధులతో నిర్వహించే ప్రతిపనికీ సంబంధిత అధికారులు కమీషన్ అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో చేపడుతున్న అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ నిధులతో చేపట్టే పనులకు కూడా అధికారులు ముందుగానే తమకు తెలిసిన కాంట్రాక్టర్లతో ఆన్లైన్ టెండర్లు వేయించినట్లు సమాచారం. ముందుగా కమీషన్ మాట్లాడుకొని ఈ నిధులతో చేపట్టే పనులను చూసీచూడనట్లు పర్యవేక్షించేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. 150 పాఠశాలల్లో ఏయే మరమ్మతులు ఉన్నాయో ఇప్పటికే అధికారులు నివేదిక రూపొందిం చారు. కమీషన్లు పుచ్చుకున్న అధికారులు నిద్రావస్థలో ఉంటే ఇక కాంట్రాక్టర్లు ఈ పనులను ఇష్జారాజ్యంగా చేయడం.. అవి ఇక మూణ్నాళ్ల ముచ్చటగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమన్వయం లేక నిధులు వృథా.. విద్యాశాఖకు సంబంధించి రాజీవ్ విద్యామిషన్, డీఈఓ కార్యాలయం, ఆర్‌ఎంఎస్‌ఏల మధ్య పూర్తిగా సమన్వయం లేకపోవడంతో ఎన్ని నిధులు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్‌ఎంఎస్‌ఏ, ఆర్వీఎం నిధుల ఖర్చు విషయంలో ఇటీవల భారీగా అవకతవకలు జరిగాయి. సరైన ఆడిట్ లేక, క్షేత్రస్థాయిలో చేసిన పనులపై పర్యవేక్షణ లేక అధికారులు అందినకాడికి దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో చేపట్టే పనులపై పూర్తిగా ఆయా అధికారుల పర్యవేక్షణ ఉండకుంటే ఖర్చు చేసిన నిధులు వృథా కానున్నాయి. అధికారుల మధ్య సక్యత కొరవడటంతో కూడా నిధులను సద్వినియోగం చేసే విషయంలో ఎవరికివారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. గత విద్యా సంవత్సరం ఆర్వీఎం నిధులతో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలోనూ నాణ్యత లోపించడంతో అవి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఉన్నతాధికారులు దృష్టి పెడితేనే ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో చేపట్టే పనులు నాణ్యతగా జరుగుతాయని పలువురంటున్నారు.