పాలమూరు, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్.. కాకిలెక్కల పథకంలా మారింది. ప్రభుత్వ బడుల్లో గ్రంథాలయ పుస్తకాలు, ప్రయోగశాలల ఏర్పాటు తదితరాలు సమకూర్చి విద్యా ప్రమాణాలను పెంచడం.. రేపటి పౌరులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘ఆర్‌ఎంఎస్‌ఏ’ అమలు అధ్వానమవుతోంది. గతంలో ఈ పథకం ద్వారా 6,7,8 తరగతుల విద్యార్థులకోసం ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికీ చూపడం విశేషం.
ఇప్పటి వరకు రూ.6.29 కోట్లు మంజూరై వాటిని వినియోగించినప్పటికీ.. పాఠశాలల్లో ఎక్కడా అంత మొత్తానికి తగ్గా పరికరాలుగాని, వస్తువులుగానీ కనపించడం లేదు. భవనాల నిర్మాణంతోపాటు పరికరాలు, ఇతరత్రా నిధులపై ఆజమాయిషీ లేకపోవడంతో కిందిస్థాయిలో ఆడిందే ఆటగా మారింది. నిధుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఏటా ఉద్యోగోన్నతులు, బదిలీలు, ఉద్యోగ విరమణ వంటి సమయాల్లో నోడ్యూస్ పత్రాలను తీసుకోక పోవడం, రికార్డుల నిర్వహణలో అవకతవకలు ఇందుకు కారణంగా తెలుస్తోంది.
నిధుల విడుదల ఇలా..!
2009-10లో 590 పాఠశాలలకు రూ.7,425 వంతున రూ.43.80లక్షలు ఇచ్చారు. ఇందులో దాదాపు 25 పాఠశాలల నుంచి వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇంకా ఇవ్వలేదు.
2010-11లో రూ.34,250 వంతున 590 పాఠశాలలకు రూ.2.02కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులను ఖర్చు పెట్టిన 45 పాఠశాలల నుంచి యూసీలు రాలేదు.
2011-12లో 590 పాఠశాలలకు రూ. 50వేల వంతున రూ.2,95 కోట్లు ఇచ్చారు. ఇంకా 60 పాఠశాలల నుంచి నిధులను ఖర్చు పెట్టినట్లు వినియోగతపత్రం ఇవ్వలేదు.
2012-13లో 590 పాఠశాలలకు రూ. 15వేల వంతున రూ. 88.50లక్షలు కేటాయించగా.. 2013-14కు గాను రూ.55 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన నిధుల వినియోగంపై ఎటువంటి సమాచారం లేదు.
ఖర్చులకు లెక్కే లేదు..!
ప్రయోగ శాలలకు ఇచ్చిన నిధులతో గణితం, సామాన్య శాస్త్రం పరికరాలు కొనుగోలు చేయడానికి నిర్దేశిత కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిందే. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక కిట్ ఉండాలి. వీటిలో రూ.20-30వేల వరకు వెచ్చించారు. ఆర్‌వీఎంలో 6-8 వరకు ప్రయోగశాలలకు నిధులు ఇచ్చారు. దాదాపుగా రూ. 25వేలను కేటాయించారు. చాలా వరకు కొనుగోలు చేశారు. అయినా ఈ కోటా నిధులు ఇవ్వడంతో వాటిని మళ్లీ చూపించే అవకాశం ఉంది. అలాగే చేస్తున్నారని సమాచారం. పుస్తకాల కొనుగోలులో తెలుగు అకాడమీ సూచించిన 23 రకాల పుస్తకాలు, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ, ఎన్సీఈఆర్టీ సూచించిన ఇరవై రకాల పుస్తకాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఆర్వీఎంలో కొనుగోలు చేసిన పుస్తకాలను ఈ పథకంలో చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కంప్యూటర్ విద్యకు ఐఈజీ (ఈ-గవర్నెన్స్)తో ఇంటర్‌నెట్ సౌకర్యం ఉంది. అయినా మళ్లీ ఇంటర్ నెట్ పెట్టుకోవడానికి ఈ పథకంలో అవకాశం ఇవ్వడంతో నిధుల దుబారాకు అవకాశం కలిగినటై ్లంది.
లెక్కల్లో అన్నీ.. పరికరాలే కొన్ని..!
Published Wed, Feb 12 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement