సర్వ శిక్ష అభియాన్ | Prepare the dismissal of five officials? | Sakshi
Sakshi News home page

సర్వ శిక్ష అభియాన్

Published Fri, Jun 17 2016 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

సర్వ శిక్ష అభియాన్ - Sakshi

సర్వ శిక్ష అభియాన్

ఐదుగురు అధికారుల తొలగింపునకు రంగం సిద్ధం?
మరో ఇద్దరిపై బదిలీవేటు..?
రేపోమాపో ఉత్తర్వులు డీఈవోపై ఒత్తిళ్లు
కొంపముంచిన ఉత్తరాలు
 

 
 కరీంనగర్ ఎడ్యుకేషన్ : సర్వశిక్షాభియాన్(ఎస్‌ఎస్‌ఏ) జిల్లా కార్యాల యంలో అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. సమన్వయం కొరవడి ఒకరి విభాగాలపై మరొకరు ఉత్తరాల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల ఓ అజ్ఞాత వ్యక్తి సర్వశిక్ష అభియాన్‌లో పెద్దఎత్తున అవి నీతి, అక్రమాలు జరుగుతున్నాయని, సెక్టోరల్ అధికారులంతా తిష్టవేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు.. అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్పీ, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డెరైక్టర్, కలెక్టర్‌కు మెయిల్ ద్వారా లేఖలు పం పించారు. ఇది జిల్లా విద్యాశాఖలో కలకలం రేపుతోం ది. ఈ క్రమంలో సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి, డీఈవో శ్రీనివాసాచారి ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో అసలేం జరుగుతోంది..?

ఎంతమంది ఉద్యోగులు డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు..? ఎన్నేళ్లుగా తిష్టవేశారు..? అనే అంశాలపై పూర్తిగా ఆరాతీశారు. ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర నివేదికను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డెరైక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో నిబంధనలకు విరుద్దంగా తిష్టవేసి ప్రభుత్వ కార్యక్రమాలు, విధులు సక్రమంగా నిర్వర్తించకుండా విద్యాశాఖ పరువును బజారుకీడిస్తున్న వారిపట్ల వేటు వేయడానికి ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డెరైక్టర్ మొగ్గుచూపినట్లు సమాచారం.

 సెక్టోరల్ అధికారుల డెప్యుటేషన్లు రద్దు..?
 ఫారన్ సర్వీసులో సర్వశిక్షాభియాన్‌లో పనిచేసేందుకు వచ్చిన సెక్టోరల్ అధికారులు నిబంధనల ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో అన్నివిభాగాల్లోను విద్యాశాఖ నుంచి డెప్యుటేషన్లు వేరుుంచుకుని ఉత్తర్వు లు లేకుండానే విధుల్లో కొనసాగుతున్నారు. సీఎంవో శ్రీనివాస్, ఏఎంవో ప్రభాకర్‌రావు, ఏపీవో బి.రాజేంద ర్, ఎఎస్‌వో రఘునందన్‌రావు, సూపరింటెండెంట్ రాజశేఖర్ ఫారన్ సర్వీసులో వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ఐదేళ్లు గడుస్తున్నా తిరిగి మాతృసంస్థ(విద్యాశాఖ)కు వెళ్లడంలేదు. అధికారులను మచ్చిక చేసుకుంటూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీనికితోడు ఆధిపత్య పోరులో భాగంగా కార్యాలయ వ్యవహారాలను బహిర్గతం చేయడం, ఒకరిశాఖపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది.  


 మరో ఇద్దరిపై బదిలీ వేటు...?
 సర్వశిక్షాభియాన్‌లో పనిచేస్తున్న జీసీడీఏ అనురాధ, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజభాను చంద్రప్రకాశ్‌ను కూ డా తప్పించాలని అధికారులకు నివేదించిన లేఖలో ఉన్నట్లు సమాచారం. కార్యాలయంలో జరిగే వ్యవహా రంపై సమన్వయం కొరవడడంతోనే మెయిల్ ఉత్తర, ప్రత్యుత్తరాల పరంపర కొనసాగిందని, ఇలాంటి తరుణంలో సెక్టోరల్ అధికారులందరినీ తొలగించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రేపోమాపో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ నుంచి సెక్టోరల్ అధికారులందరినీ మాతృసంస్థకు పంపుతూ.. డెప్యుటేషన్లు రద్దు చేసేలా ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.


 డీఈవోపై ఒత్తిళ్లు
 సర్వశిక్షాభియాన్‌లో జరుగుతున్న వ్యవహారంపై డీఈవో శ్రీనివాసాచారి నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. దీంతో సెక్టోరల్ అధికారులందరినీ మాతృసంస్థ(విద్యాశాఖ)కు పంపడమే ఉత్తమమని రాష్ట్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించారు. ఎస్‌ఎస్‌ఏ డెరైక్టర్ నుంచి సెక్టోరల్ అధికారులందరినీ విధుల్లో నుంచి తోలగించాలనే ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని తేలింది. కోన్నేళ్లుగా తిష్టవేసిన సెక్టోరల్ అధికారులు.. రాజకీయ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టేక్కించాలని తిరిగి తమను యధావిధిగా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో ఉంచేలా చూడాలని డీఈవోపై ప్రజాప్రతినిధులతో ఒత్తిళ్లు అధికమవుతున్నట్లు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement