Sectoral authorities
-
ఎన్నికల అధికారుల విధులు ఇలా..
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : మనది ప్రజాస్వామ్య దేశం. ఓటరు తమ ఓటు ద్వారా మంచి వ్యక్తులను గద్దెనెక్కించే సత్తా ఉంది. ఈ అధికారాన్ని ఓటరుకు రాజ్యాంగం హక్కుగా కల్పించింది. అలాంటి విలువైన ఓటు వేయాలంటే దాని వెనుక ఎంతో మంది అధికారుల కృషి ఉంటుంది. గ్రామ స్థాయి బూతు లేవల్ అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్నికలు ప్రశాతంగా పూర్తవుతాయి.అధికారుల్లో సమన్వయం లోపిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు నుంచి పోలింగ్,ఎన్నికల నియమావళి,అమలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరించే వరకు అధికారులు బాధ్యతగా పనిచేయ వలసి ఉంటుంది. మరి ఏ అధికారికి ఏయే బాధ్యతలు..అధికారాలు ఉంటాయో తెలుసుకుందాం. ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతలు: శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నిక కమిషన్ ఈ అధికారిని నియమిస్తుంది. ఆయన సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. నామినేషన్ పక్రియా, తుది జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెళ్లడి వంటి అన్ని అంశాలు ఈ అధికారి పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు. సెక్టోరల్ అధికారి : 8 నుంచి 10 పోలింగ్ కేంద్రాల పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పరిస్థితులను బట్టి పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించే అధికారాలు వీరికి ఉంటాయి. ఓటు నమోదు అధికారి : ఓట్ల నమోదు జాబితాను తయారు చేయడం ఆయన ప్రధాన విధి. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు అధికారిని సంప్రదించ వలసి ఉంటుంది. ప్రిసైండింగ్ అధికారి : సంబంధిత పోలింగ్ కేంద్రానికి ప్రిసైండింగ్ అధికారిదే పూర్తి బాధ్యత. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను, వీవీపాట్లను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, ఎన్నికలను ప్రశాతంగా నిర్వహించి,మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూమ్‌లో చేర్చే వరకు ఈ అధికారి బాధ్యత వహిస్తారు. వీరికి సహాయ ప్రిసైండింగ్ అధికారులు ఉంటారు.బాధ్యతలను అప్పగించిన పోలింగ్ స్టేషన్లో జరిగే కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయి. సూక్ష్మ పరిశీలకులు : ఎన్నికల నిర్వహణ జరిగిన తీరు, సంబంధిత పర్యవేక్షణపై నివేదిక రూపొందించి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. బూత్ లెవల్ అధికారి : కొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పులు సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులు ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వారి బాధ్యత. -
సర్వ శిక్ష అభియాన్
► ఐదుగురు అధికారుల తొలగింపునకు రంగం సిద్ధం? ►మరో ఇద్దరిపై బదిలీవేటు..? ►రేపోమాపో ఉత్తర్వులు డీఈవోపై ఒత్తిళ్లు ► కొంపముంచిన ఉత్తరాలు కరీంనగర్ ఎడ్యుకేషన్ : సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా కార్యాల యంలో అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. సమన్వయం కొరవడి ఒకరి విభాగాలపై మరొకరు ఉత్తరాల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల ఓ అజ్ఞాత వ్యక్తి సర్వశిక్ష అభియాన్‌లో పెద్దఎత్తున అవి నీతి, అక్రమాలు జరుగుతున్నాయని, సెక్టోరల్ అధికారులంతా తిష్టవేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు.. అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్పీ, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్, కలెక్టర్‌కు మెయిల్ ద్వారా లేఖలు పం పించారు. ఇది జిల్లా విద్యాశాఖలో కలకలం రేపుతోం ది. ఈ క్రమంలో సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి, డీఈవో శ్రీనివాసాచారి ఎస్ఎస్ఏ కార్యాలయంలో అసలేం జరుగుతోంది..? ఎంతమంది ఉద్యోగులు డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు..? ఎన్నేళ్లుగా తిష్టవేశారు..? అనే అంశాలపై పూర్తిగా ఆరాతీశారు. ఎస్ఎస్ఏ కార్యాలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర నివేదికను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో నిబంధనలకు విరుద్దంగా తిష్టవేసి ప్రభుత్వ కార్యక్రమాలు, విధులు సక్రమంగా నిర్వర్తించకుండా విద్యాశాఖ పరువును బజారుకీడిస్తున్న వారిపట్ల వేటు వేయడానికి ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్ మొగ్గుచూపినట్లు సమాచారం. సెక్టోరల్ అధికారుల డెప్యుటేషన్లు రద్దు..? ఫారన్ సర్వీసులో సర్వశిక్షాభియాన్‌లో పనిచేసేందుకు వచ్చిన సెక్టోరల్ అధికారులు నిబంధనల ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో అన్నివిభాగాల్లోను విద్యాశాఖ నుంచి డెప్యుటేషన్లు వేరుుంచుకుని ఉత్తర్వు లు లేకుండానే విధుల్లో కొనసాగుతున్నారు. సీఎంవో శ్రీనివాస్, ఏఎంవో ప్రభాకర్‌రావు, ఏపీవో బి.రాజేంద ర్, ఎఎస్వో రఘునందన్‌రావు, సూపరింటెండెంట్ రాజశేఖర్ ఫారన్ సర్వీసులో వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ఐదేళ్లు గడుస్తున్నా తిరిగి మాతృసంస్థ(విద్యాశాఖ)కు వెళ్లడంలేదు. అధికారులను మచ్చిక చేసుకుంటూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీనికితోడు ఆధిపత్య పోరులో భాగంగా కార్యాలయ వ్యవహారాలను బహిర్గతం చేయడం, ఒకరిశాఖపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. మరో ఇద్దరిపై బదిలీ వేటు...? సర్వశిక్షాభియాన్‌లో పనిచేస్తున్న జీసీడీఏ అనురాధ, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజభాను చంద్రప్రకాశ్‌ను కూ డా తప్పించాలని అధికారులకు నివేదించిన లేఖలో ఉన్నట్లు సమాచారం. కార్యాలయంలో జరిగే వ్యవహా రంపై సమన్వయం కొరవడడంతోనే మెయిల్ ఉత్తర, ప్రత్యుత్తరాల పరంపర కొనసాగిందని, ఇలాంటి తరుణంలో సెక్టోరల్ అధికారులందరినీ తొలగించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రేపోమాపో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ నుంచి సెక్టోరల్ అధికారులందరినీ మాతృసంస్థకు పంపుతూ.. డెప్యుటేషన్లు రద్దు చేసేలా ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. డీఈవోపై ఒత్తిళ్లు సర్వశిక్షాభియాన్‌లో జరుగుతున్న వ్యవహారంపై డీఈవో శ్రీనివాసాచారి నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. దీంతో సెక్టోరల్ అధికారులందరినీ మాతృసంస్థ(విద్యాశాఖ)కు పంపడమే ఉత్తమమని రాష్ట్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించారు. ఎస్ఎస్ఏ డెరైక్టర్ నుంచి సెక్టోరల్ అధికారులందరినీ విధుల్లో నుంచి తోలగించాలనే ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని తేలింది. కోన్నేళ్లుగా తిష్టవేసిన సెక్టోరల్ అధికారులు.. రాజకీయ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టేక్కించాలని తిరిగి తమను యధావిధిగా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో ఉంచేలా చూడాలని డీఈవోపై ప్రజాప్రతినిధులతో ఒత్తిళ్లు అధికమవుతున్నట్లు సమాచారం. -
ఓటు ప్రాధాన్యతపై అవగాహన
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై, వినియోగంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎన్నికల పరిశీలకులు వివిధ కమిటీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల కోరకు 260 మంది సెక్టోరల్ అధికారులు, 400 వాహనాలు ఎన్నికల విధుల కొరకు వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో 420 ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాపు 1100 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 24, 25 తేదీల్లో నియోజకవర్గాలవారీగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 26,27వ తేదీల్లో మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణ కార్యక్రమాల ద్వారా పూర్తి అవగాహన పెంచుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఫొటో ఓటరు జాబితా పంపించామని, రాజకీయ పార్టీల నాయకులకు ఓటరు జాబితా అందజేయాలని రిటర్నింగ్ ధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టి ఇప్పటివరకు రూ.58 లక్షల విలువ చేసే లిక్కర్‌ను సీజ్ చేయడం జరిగిందన్నారు. పోలింగ్‌శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని, 95 శాతం పోలింగ్ నమోదు చేసిన నోడల్ అధికారులకు రూ.10 వేల చొప్పున పారితోషకం ఇస్తాం. అనంతరం ఎన్నికల పరి శీలకులకు పంకజ్ జోషి మాట్లాడుతూ సింగిల్ విండో విధానం ద్వారా అభ్యర్థుల వాహనాలకు అనుమతి తీసుకోవాలని, ఖర్చుల వివరాలు పూర్తిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,241 మందిని బైండోవర్ కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.50 వేల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు 6 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు 11 కంపెనీల సీఆర్పీఎఫ్, 18 సెక్షన్ల పారామిలటరీ బృందాలను వినియోగించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, సబ్ కలెక్టర్‌ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఓఎస్డీ పనసారెడ్డి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, రిటర్నింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.