డీఎల్‌ఎంటీలు సీఆర్‌టీలుగా నియామకం
Published Thu, Jul 21 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
విద్యారణ్యపురి : జిల్లాలో తెలంగాణ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీం (డీఎల్‌ఎంటీ) పోస్టులను రద్దు చేశారు.
డీఎల్‌ఎంటీలుగా పనిచేసిన వారి సర్వీస్‌ను వినియోగించుకునేందుకు గాను అందులో అర్హులైన వారిని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ( కేజీబీవీ) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్లు (సీఆర్‌టీ)గా నియామకం చేస్తూ సర్వశిక్షాభియాన్ జిల్లా ఇన్‌చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో తొమ్మిది మంది డీఎల్‌ఎంటీలు 2012 నుంచి పని చేస్తున్నారు. డీఎల్‌ఎంటీగా పనిచేస్తున్న డి.రేణుకను జనగామ కేజీ బీవీ మ్యాథ్స్ సీఆర్‌టీగా, ఎం.స్వప్నను ఏటూరునాగారం ఫిజికల్ సైన్స్ సీఆర్‌టీగా, జె.స్వప్నను కొడకండ్ల ఇంగ్లిష్ సీఆర్‌టీగా, జి. చైతన్య శాయంపేట బయోసైన్స్ సీఆర్‌టీగా, ఏ.కవితను కొత్తగూడెం ఫిజికల్‌సైన్స్ సీఆర్‌టీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Advertisement
Advertisement