crt
-
బడి‘బాట’ పట్టేనా..
ఆదిలాబాద్‌టౌన్: బడీడు పిల్లలకు బడి ‘బాట’ వేసేందుకు విద్యాశాఖ సర్వే చేపట్టనుంది. బాలకార్మికులు పని లోకాదు..బడిలో ఉండాలనే లక్ష్యంతో ఏటా చేపడుతున్న సర్వే ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. నివేదిక సమర్పించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారు తప్పితే పిల్లలను బడిలో చేర్పించడానికి శ్రద్ధచూపడం లేదు. ఏటా బడిబయట పిల్లలకోసం విద్యాశాఖ సర్వే చేపడుతోంది. ఈసారి కూడా బడిదూరంగా ఉన్న వారి లెక్కతేల్చేందుకు మళ్లీ వివరాలు సేకరించనుంది. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి 28 వర కు నిర్వహించనుంది. అయితే ఏటా సర్వే చేపడుతున్నా బడిబయట పిల్లల్ని బడిబాట పట్టించడంలో అధికా రులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మెప్మా, సెర్ప్ సిబ్బందితో బడిబయట ఉన్న పిల్లల సర్వే చేపట్టారు. అయితే వారు పూర్తిస్థాయిలో సర్వే చేçపట్టకుండా ముగించేశారు. బడిబయట పిల్లలు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుతూ, హోటళ్లలో పని చేస్తూ కనిపించారు. ఈఏడాది మళ్లీ విద్యాశాఖ బడిబయటి పిల్లల సర్వేకు సిద్ధమైంది. ఈనెల24 నుంచి 28వ తేదీ వరకు సర్వే కొనసాగించనున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లల్ని పాఠశాలల్లో, కేజీబీవీల్లో, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్, నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో చేర్పించి విద్యాబోధన చేయిం చేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈసారైనా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తే బడిబయటి పిల్లలు బడిలో చేరి అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. గాలి లెక్కలు..ఐకేపీ, సెర్ప్ సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వే చేపట్టకుండా ఇళ్లకే పరిమితమై లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం 196 మంది పిల్లలు బడిబయట ఉన్నారని వారు నివేదిక సమర్పించారు. అయితే జిల్లాలో దాదాపు వందలసంఖ్యలో బడిబయట పిల్లలు దర్శనమిస్తున్నారు. ఇటుకబట్టీలు, లాడ్జీలు, హోటళ్లు తదితర వ్యాపార సముదాయాల్లో పనులు చేస్తున్నారు. వారు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం.. తాంసి మండలంలో ఒకరు, గాదిగూడలో ఒకరు, మావలలో నలుగురు, నార్నూర్‌లో ఐదుగురు, బోథ్‌లో ఐదుగురు, ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఆరుగురు, భీంపూర్‌లో 8, గుడిహత్నూర్‌లో 22, ఇచ్చోడలో 8, నేరడిగొంలో 14, ఉట్నూర్‌లో 23, ఆదిలాబాద్ పట్టణంలో 85 మంది, బజార్హత్నూర్లో 14 మంది మొత్తం 196 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు సర్వే నివేదిక సమర్పించారు. ఇందులో బాలురు 100 మంది, బాలికలు 96 మంది ఉన్నట్లు తేల్చారు. వారంరోజులపాటు సర్వే జిల్లాలో గతేడాది నిర్వహించిన సర్వేలో 196 మంది బడిబయట పిల్లలు ఉండగా, వారిలో 58 మంది బడిబాటపట్టించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో ఆడపిల్లలు 31 మంది, మగపిల్లలు 27 మందిని చేర్పించినట్లు చెబుతున్నారు. అయితే మిగతా 132 మంది పిల్లలు బడిలో ఉన్నారా..బడి బయట ఉన్నారా.. పాఠశాలల్లో నెలరోజుల కంటే ఎక్కువ హాజరుకాని విద్యార్థుల వివరాలు సేకరించనున్నారు. నెలరోజుల నుంచి బడికి రానట్లయితే వారిని కూడా బడిబయట పిల్లలుగానే పరిగణించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వేను సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఎంఈవో కార్యాలయంలో పని చేసే డాటాఎంట్రీ ఆపరేటర్లు, భవిత రిసోర్స్ సెంటర్లలో పని చేసే ఐఈఆర్పీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పని చేసే సీఆర్టీలతో సర్వే చేపడతారు. ఈ వివరాలు సేకరించిన అనంతరం బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించనున్నారు. 11 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లల్ని కేజీబీవీలో, మగపిల్లల్ని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి విద్య బోధించనున్నారు. కాగా కొత్తగా నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బడిబయటి పిల్ల లకు విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. జిల్లావ్యాప్తంగా దాదాపు వెయ్యి మందికిపైగా బడిబయట పిల్లలు ఉండగా సర్వేలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆయామండలాల్లో పదు ల సంఖ్యలోనే పిల్లలు ఉన్నట్లు నివేదిక సమర్పిం చారు. బడిలో చేర్పించిన అనంతరం ఆ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో చాలా మంది మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. పిల్లలను బడిబాటపట్టించే లక్ష్యం నీరుగారుతోంది. -
ఎస్ఓలు, సీఆర్టీలపై వేటు
- ఎస్ఎస్ఏ సిబ్బందిలో ఆందోళన - సరైన నిర్ణయం కాదంటున్న బాధితులు అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రతిభ ఆధారంగా వెనుకబడిన కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓ), సీఆర్టీలను విధుల నుంచి తప్పించడం ఎస్ఎస్ఏలో కలకలం రేపుతోంది. కేవలం 2016–17 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల ఆధారంగా ఈ చర్యలు చేపట్టడాన్ని కేజీబీవీల సిబ్బంది తప్పు పడుతోంది. ఆరేళ్లుగా పని చేస్తున్నామని, ఇన్నేళ్లు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఒక ఏడాది తగ్గాయనే కారణంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమంటున్నారు. కణేకల్ ఎస్ఓగా ఉన్న రమాదేవి గతేడాది మడకశిరకు వెళ్లారు. ఈమె కణేకల్‌లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తీర్ణత శాతం తగ్గిందని వేటు వేశారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి గల కారణాలను చూపకుండా కేవలం ఎస్ఓలు, సంబంధిత సబ్జెక్టు సీఆర్టీలను బాధ్యులను చేస్తే ఎలా? అని వాపోతున్నారు. సమస్యల సుడిగుండంలో కేజీబీవీలు సమస్యలు లేని కేజీబీవీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. అన్ని కేజీబీవీలూ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆడ పిల్లలు అందులోనూ శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు అలాంటి వారికి పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యం. నెలల తరబడి సరుకుల సరఫరా చేసిన టెండరుదారులకు బిల్లులు చెల్లించలేదు. రూ. లక్షల్లో బకాయి ఉండడంతో సరుకులు అంతంతమాత్రంగానే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్ఓలు, సీఆర్టీలతో పాటు బోధనేతర సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు మంజూరు చేయలేదు. వీరంతా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్నారు. చాలా కుటుంబాలు జీతాలపై ఆధారపడే జీవిస్తున్నాయి. కేజీబీవీల్లో సిలిండర్లకు ప్రతినెలా రూ. 15–18 వేలు దాకా ఖర్చవుతుంది. బిల్లులు రాక పోవడంతో ఎస్ఓలు చేతినుంచే ఖర్చు పెట్టుకోవాలి. వారికి జీతాలు రాక అల్లాడుతుంటే సిలిండర్లు, కరెంటు బిల్లులకు అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్నారు. జీతాలు రాకపోవడంతో మరోవైపు కుటుంబాల నిర్వహణ కష్టంగా మారి సతమతమవుతున్నారు. అటు కుటుంబంలో సమస్యలు, ఇటు కేజీబీవీల ఇబ్బందులతో ఊపిరాడడం లేదని, ఇవన్నీ అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీల్లో చదువుకునే ఆడపిల్లలకు కాస్మోటిక్స్ చార్జీ ప్రతినెలా రూ. 100 చెల్లించాలి. సరిగ్గా ఏడాదికి పైగా ఒక్కరూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా అనేక సమస్యలతో అల్లాడుతుంటే వాటి గురించి పట్టించుకోని ఉన్నతాధికారులు కేవలం పదో తరగతి ఉత్తీర్ణత ప్రామాణికంగా చర్యలు తీసుకోవాడం అన్యాయమని వాపోతున్నారు. -
కేజీబీవీల్లో ‘పది’ ఫలితాల ఎఫెక్ట్
ముగ్గురు సీఆర్టీల తొలగింపు అనంతపురం ఎడ్యుకేషన్ : ఎస్ఎస్ఏ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న సీఆర్టీ (కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్)లపై పదో తరగతి ఫలితాల ప్రభావం పడింది. ఈ క్రమంలో ముగ్గురిని విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. 2015 –16 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో కళ్యాణదుర్గం కేజీబీవీలో 15 మంది బాలికలు గణితంలో, కంబదూరులో 8 మంది విద్యార్థినులు సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఇందుకు బాధ్యులను చేస్తూ కళ్యాణదుర్గం కేజీబీవీలో గణితం సీఆర్టీగా పని చేస్తున్న మునెమ్మ, కంబదూరు కేజీబీవీలో ఫిజికల్ సైన్స్ (పీఎస్) సీఆర్టీగా పని చేస్తున్న వరలక్ష్మీ, న్యాచురల్ సైన్స్ (ఎన్ఎస్) సీఆర్టీగా పని చేస్తున్న మంజులను తొలిగించారు. కొందరు పిల్లలు కొన్ని సబ్జెక్టుల్లో పూర్తిగా వెనుకబడి ఉంటారని అందుకు తమను బాధ్యులు చేయడం ఎంతవరకు సబబని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉం డగా బాధితులు జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధులను ఆశ్రయించి వారి ద్వారా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లినట్లు సమాచారం. -
ఎస్ఎస్ఏలో ఎస్వో, సీఆర్టీలకు బదిలీలు
– 11ఏళ్లలో రాష్ట్రస్థాయిలో రెండోసారి – రెండేళ్లుదాటì న ఎస్వోలు, మూడేళ్లదాటిన సీఆర్టీలకు – 3,168 మందికి స్థాన చలనం, బదిలీల షెడ్యూలు జారీ బి.కొత్తకోట (చిత్తూరుజిల్లా): సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఒకేచోట ఏళ్లతరబడి పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు, సీఆర్టీ (కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్), పీఈటీ ల బదిలీలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్ఎస్ఏ రాష్ట్రప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్ జారీచేసిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి జిల్లాల పీవో కార్యాలయాలకు చేరాయి. విద్యాలయాలు ప్రారంభమైన 11ఏళ్లలో రాష్ట్రస్థాయిలో బదిలీలకు శ్రీకారం చుట్టడం ఇది రెండోసారి. దీంతో రాష్ట్రంలోని 352 విద్యాలయాల్లో పనిచేస్తున్న 3,168 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆయా జిల్లాల్లోని ఇతరా విద్యాయాలకు బదిలీలు కానున్నారు. రాష్ట్రంలో 2005–06లో కేజీబీవీలను ప్రారంభించగా ఒక్కో విద్యాలయానికి ఒక ప్రత్యేకాధికారి, ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లు, ఒక పీఈటీలను నియమించారు. ప్రారంభంనుంచి వీరికి ఒకసారి మాత్రమే రాష్ట్రస్థాయిలో బదిలీలను నిర్వహించగా మళ్లీ రెండోసారి బదిలీలు చేపట్టారు. వెబ్ ద్వారా బదిలీలు జూన్ ఒకటినాటికి ఒకేచోట రెండేళ్లు పూర్తిచేసుకున్న ఎస్వోలు, మూడేళ్లు పూర్తిచేసుకున్న సీఆర్టీలు బదిలీలకు అర్హులు. బదిలీల్లో ప్రాధాన్యతలను నిర్ణయించారు. గడచిన మూడేళ్లు 10వ తరగతి మంచి ఫలితాలు సాధించడం, తరగతుల్లో బాలికల సంఖ్య నిలకడగా ఉంటే వారికి అదనపు పాయింట్లు ఇస్తారు. అలాగే 100శాతం విద్యార్థుల నమోదు, చట్ట పరిధిలో విడాకులు పొందినవారు, భర్త ప్రభ్వుత ఉద్యోగి అయివుంటే, అంగవైకల్యం కలిగివున్నా, అవివాహితులై ఉన్నా వారికి అదనపు పాయింట్లు ఇస్తారు. వీరందికి బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారు. సెపెంబర్ 6న బదిలీల ప్రక్రియ చేపట్టి 30కు పూర్తి చేస్తారు. బదిలీ అయినవాళ్లు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాల్సివుంటుంది. బదిలీల షెడ్యూల్ ఇదే సెప్టెంబర్ 6–సిబ్బంది వివరాలు, ఖాళీగావున్న పోస్టుల వివరాల నమోదు సెప్టెంబర్ 7–8–దరఖాస్తుదారులు ఎక్కడికి బదిలీకావాలో కోరుకోవడం సెప్టెంబర్ 12–దరఖాస్తుల పరిశీలన సెప్టెంబర్ 17–దరఖాస్తు లోపాల సవరణ పూర్తి చేయుట సెప్టెంబర్ 19–21–జిల్లాల పీఓలు సిద్దంచేసిన తుది జాబీతా ఎస్పీఓ పరిశీలన సెప్టెంబర్ 22–23–పీఓ, ఎస్పీఓ కార్యాలయాల్లో తాత్కాలిక సీనియారిటీ జాబీతా ప్రదర్శన సెప్టెంబర్ 24–27–సీనియారిటీ జాబీతాపై అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 28–29–అభ్యంతరాలను పరిష్కరించి, తుది జాబీతా ప్రకటన సెప్టెంబర్ 30–బదిలీలు, ఉత్తర్వులు జారీ -
డీఎల్ఎంటీలు సీఆర్టీలుగా నియామకం
విద్యారణ్యపురి : జిల్లాలో తెలంగాణ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీం (డీఎల్‌ఎంటీ) పోస్టులను రద్దు చేశారు. డీఎల్ఎంటీలుగా పనిచేసిన వారి సర్వీస్‌ను వినియోగించుకునేందుకు గాను అందులో అర్హులైన వారిని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ( కేజీబీవీ) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్లు (సీఆర్టీ)గా నియామకం చేస్తూ సర్వశిక్షాభియాన్ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో తొమ్మిది మంది డీఎల్ఎంటీలు 2012 నుంచి పని చేస్తున్నారు. డీఎల్‌ఎంటీగా పనిచేస్తున్న డి.రేణుకను జనగామ కేజీ బీవీ మ్యాథ్స్ సీఆర్టీగా, ఎం.స్వప్నను ఏటూరునాగారం ఫిజికల్ సైన్స్ సీఆర్టీగా, జె.స్వప్నను కొడకండ్ల ఇంగ్లిష్ సీఆర్టీగా, జి. చైతన్య శాయంపేట బయోసైన్స్ సీఆర్టీగా, ఏ.కవితను కొత్తగూడెం ఫిజికల్సైన్స్ సీఆర్టీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
సీఆర్టీలకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్టీలు)కు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయం వల్ల మొత్తం 1,892 మంది టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్జీటీ కేడర్ టీచర్లకు గతంలో రూ.4,500 చెల్లిస్తుండగా, దానిని రూ.10.900కు పెంచారు. అదేవిధంగా ఎస్ఏ కేడర్‌కు గతంలో రూ.5,500 ఇస్తుండగా, దానిని రూ.14,860కు పెంచారు. ఈ మేరకు శనివారం ఎస్టీశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.