ఎస్‌ఎస్‌ఏలో ఎస్‌వో, సీఆర్‌టీలకు బదిలీలు | transfer for so,crt | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఏలో ఎస్‌వో, సీఆర్‌టీలకు బదిలీలు

Published Thu, Sep 1 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

చిత్తూరుజిల్లా బి.కొత్తకోటలో  కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం

చిత్తూరుజిల్లా బి.కొత్తకోటలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం

 
– 11ఏళ్లలో రాష్ట్రస్థాయిలో రెండోసారి  
– రెండేళ్లుదాటì న ఎస్‌వోలు, మూడేళ్లదాటిన సీఆర్‌టీలకు
– 3,168 మందికి స్థాన చలనం, బదిలీల షెడ్యూలు జారీ 
బి.కొత్తకోట (చిత్తూరుజిల్లా): 
సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఒకేచోట ఏళ్లతరబడి పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు, సీఆర్‌టీ (కాంట్రాక్ట్‌ రిసోర్స్‌ టీచర్స్‌), పీఈటీ ల బదిలీలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఏ రాష్ట్రప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్‌ జారీచేసిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి జిల్లాల పీవో కార్యాలయాలకు చేరాయి. విద్యాలయాలు ప్రారంభమైన 11ఏళ్లలో రాష్ట్రస్థాయిలో బదిలీలకు శ్రీకారం చుట్టడం ఇది రెండోసారి. దీంతో రాష్ట్రంలోని 352 విద్యాలయాల్లో పనిచేస్తున్న 3,168 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆయా జిల్లాల్లోని ఇతరా విద్యాయాలకు బదిలీలు కానున్నారు. రాష్ట్రంలో 2005–06లో కేజీబీవీలను ప్రారంభించగా ఒక్కో విద్యాలయానికి ఒక ప్రత్యేకాధికారి, ఏడుగురు సబ్జెక్ట్‌ టీచర్లు, ఒక పీఈటీలను నియమించారు. ప్రారంభంనుంచి వీరికి ఒకసారి మాత్రమే రాష్ట్రస్థాయిలో బదిలీలను నిర్వహించగా మళ్లీ రెండోసారి బదిలీలు చేపట్టారు.  
వెబ్‌ ద్వారా బదిలీలు 
జూన్‌ ఒకటినాటికి ఒకేచోట రెండేళ్లు పూర్తిచేసుకున్న ఎస్‌వోలు, మూడేళ్లు పూర్తిచేసుకున్న సీఆర్‌టీలు బదిలీలకు అర్హులు. బదిలీల్లో ప్రాధాన్యతలను నిర్ణయించారు. గడచిన మూడేళ్లు 10వ తరగతి మంచి ఫలితాలు సాధించడం, తరగతుల్లో బాలికల సంఖ్య నిలకడగా ఉంటే వారికి అదనపు పాయింట్లు ఇస్తారు. అలాగే 100శాతం విద్యార్థుల నమోదు, చట్ట పరిధిలో విడాకులు పొందినవారు, భర్త ప్రభ్వుత ఉద్యోగి అయివుంటే, అంగవైకల్యం కలిగివున్నా, అవివాహితులై ఉన్నా వారికి అదనపు పాయింట్లు ఇస్తారు. వీరందికి బదిలీలను వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా నిర్వహిస్తారు. సెపెంబర్‌ 6న బదిలీల ప్రక్రియ చేపట్టి 30కు పూర్తి చేస్తారు. బదిలీ అయినవాళ్లు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాల్సివుంటుంది. 
బదిలీల షెడ్యూల్‌ ఇదే
సెప్టెంబర్‌ 6–సిబ్బంది వివరాలు, ఖాళీగావున్న పోస్టుల వివరాల నమోదు
సెప్టెంబర్‌ 7–8–దరఖాస్తుదారులు ఎక్కడికి బదిలీకావాలో కోరుకోవడం
సెప్టెంబర్‌ 12–దరఖాస్తుల పరిశీలన
సెప్టెంబర్‌ 17–దరఖాస్తు లోపాల సవరణ పూర్తి చేయుట
సెప్టెంబర్‌ 19–21–జిల్లాల పీఓలు సిద్దంచేసిన తుది జాబీతా ఎస్‌పీఓ పరిశీలన 
సెప్టెంబర్‌ 22–23–పీఓ, ఎస్‌పీఓ కార్యాలయాల్లో తాత్కాలిక సీనియారిటీ జాబీతా ప్రదర్శన
సెప్టెంబర్‌ 24–27–సీనియారిటీ జాబీతాపై అభ్యంతరాల స్వీకరణ 
సెప్టెంబర్‌ 28–29–అభ్యంతరాలను పరిష్కరించి, తుది జాబీతా ప్రకటన
సెప్టెంబర్‌ 30–బదిలీలు, ఉత్తర్వులు జారీ 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement