సుభాష్‌నగర్: దివ్యాంగులైన విద్యార్థులతో కలెక్టర్ రామ్మోహన్‌రావు
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగమేనని, వారిని అందరితో సమానంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సహాయ ఉపకరణాల నిర్ధారణ, పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవపరమైన అన్ని సదుపాయాలు కల్పించడం సమాజం బాధ్యత అని అన్నారు. 40శాతం ప్రభుత్వ నిధులు, 60శాతం ఎంపీ నిధుల్లో నుంచి ఈ పరికరాలను అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని 374 మంది దివ్యాంగులకు భవిత కేంద్రాల్లో చదువు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందిస్తున్న రీసోర్స్ పర్సన్ అలీంతో పాటు ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గతేడాది క్యాంప్ ద్వారా గుర్తించిన 164మంది పిల్లలకు కిట్స్, ట్రై సైకిళ్లు, ఎంఆర్ కిట్లు, బ్రెయిలీ కిట్లు అందజేశారు.
శంకర్‌భవన్ స్కూల్ తనిఖీ
అంతకుముందు శంకర్‌భవన్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్‌లో వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎనిమిదో తరగ తి గదిలోకి వెళ్లి పిల్లలను సిలబస్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment