‘సహిత’ ప్రణాళిక పక్కగా అమలవ్వాలి
- ఎస్‌ఎస్‌ఏ అధికారులకు కలెక్టర్ ఆదేశం
- విద్యా పాఠ్యాంశాల ప్రణాళిక విడుదల
అనంతపురం అర్బన్: సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం రూపొందించిన సహిత విద్యా పాఠ్యాంశాల ప్రణాళిక పక్కగా అమలవ్వాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సహిత విద్యా ప్రణాళిక మాడ్యూల్‌ను కలెక్టర్ విడుదల చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు, వినికిడి లోపం ఉన్న వారికి ఈ పాఠ్యాంశాల ఎంతగానో ఉపయోగపతాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.వెంకటే శ్వర్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, ఆన్‌సెట్ సీఈఓ వెంకటేశం, కార్యక్రమం కో–ఆర్డినేటర్ పాండురంగ, సహాయ సామాజిక చైతన్య విభాగం అధికారి కిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.