జాబ్‌ ఫర్‌ సేల్‌ | job for sale in SSA | Sakshi
Sakshi News home page

జాబ్‌ ఫర్‌ సేల్‌

Published Thu, Jul 20 2017 6:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

జాబ్‌ ఫర్‌ సేల్‌ - Sakshi

జాబ్‌ ఫర్‌ సేల్‌

- సర్వశిక్షాఅభియాన్‌లో ఉద్యోగాల విక్రయం
- ఒక్కొక్క పోస్టుకు రూ. 50 వేల ధర నిర్ణయం

జిల్లా కేంద్రంలోని సర్వశిక్షా అభియాన్‌ శాఖ పరిధిలో ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు బేరసారాలు సాగుతున్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకాలకు పరీక్షలు జరగకముందే ఆ శాఖలో జాబ్‌ ఫర్‌ సేల్‌ అన్న పేరుతో కౌంటర్లు తెరిచేశారు. పోస్టు ఏదైనా సరే... డబ్బులు సమర్పిస్తే చాలు... నియామక పత్రం చేతిలో పడినట్లే ! అంతేకాదు నచ్చిన ప్రదేశంలో ఉద్యోగం ఖాయం. ఇదీ ఎస్‌ఎస్‌ఏ అవినీతి బాగోతం

చిత్తూరు ఎడ్యుకేషన్‌: సర్వశిక్షాఅభియాన్‌ కార్యాలయంలో రెగ్యులర్‌ పీఓ లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. దీంతో ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆశాఖ ఇన్‌చార్జి పీఓగా పనిచేస్తున్న ఇన్‌చార్జి డీఈఓ శామ్యూల్‌ ఆ శాఖపై సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌ రెండు శాఖ లకు ఒకే అధికారి ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది.

అమ్మకానికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు
సర్వశిక్షాఅభియాన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒ క్కొక్క పోస్టుకు ఒక్కొక్క ధర నిర్ణయించి, విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న సీఆర్‌పీ, ఎంఐఎస్, ఐఈ కోఆర్డినేటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి ఆ శాఖలోని కొంతమంది సి బ్బంది వసూళ్ల పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

గత సంవత్సరంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఇటీవల జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆమోదం తెలిపి దరఖాస్తులు స్వీకరించి పరీక్షలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ బాధ్యతలన్నీ ఆ శాఖ అధికారులకే అప్పజెప్పడంతో అక్రమాలకు తెరలేచిం ది. ఆ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఒక్కొక్క పోస్టుకు రూ.50 వేలుగా ధర నిర్ణయించి, వసూలు చేసినట్లు సమాచారం. వసూళ్ల విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా గుట్టుచప్పుడుకాకుండా జరుగుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీ నేతల సిఫార్సులు
ఓ వైపు ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అమ్ముకుంటుండగా మరో వైపు టీడీపీ ప్రజాప్రతినిధులు తాము సిఫార్సు చేసిన వారికి కచ్చితంగా ఉద్యోగం ఇవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. తాను చెప్పే 20 మందికి ఉద్యోగాలకు ఇవ్వాలని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి నుంచి ఆ శాఖ అధికారులకు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు తెలిసింది.

అసలే నిరుద్యోగం
వేలాది మంది అభ్యర్థులు ఉన్నత చదువులు చదివి ప ట్టాలు చేతబుచ్చుకుని సరైన ఉద్యోగం దొరక్క నిరుద్యోగులుగా మారారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో కి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలుపుకోకపోవడంతో ఉన్నత చదువులు చదివి కొలువులు లేక మిన్నకుండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఉన్నత విద్య చదివిన వారు కూడా చిరుద్యోగం కోసం వెంపర్లాడుతున్నారు. జిల్లా సర్వశిక్షాఅభియాన్‌లోని 162 పోస్టులకు 1400 మంది దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే ఆ పోస్టులు ముందుగానే అమ్ముడుపోతుండడంతో పలువురు నిరుద్యోగలు నిరాశపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement