జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తు చేసుకోండి
Published Thu, Mar 30 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
కర్నూలు(అర్బన్): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యారంగ వార్తా కథన పురస్కారాలు –2016 కోసం జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్షా అభియాన్ పథక అధికారి రామచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2016 జనవరి 1వ తేది నుంచి 2016 డిసెంబర్ 31వ తేది వరకు విద్యారంగంపై వివిధ పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమైన, టెలివిజన్ తెలుగు చానల్స్‌లో ప్రసారమైన వార్తా కథనాలకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడు కేటగిరీల్లో ఇచ్చే అవార్డుల కోసం తెలుగు, ఇంగ్లిషు, పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయుల దరఖాస్తుల గడువును ఏప్రెల్ 20వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఎంట్రీలను రాష్ట్ర పథక సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ విజయవాడకు అందే విధంగా పంపాలన్నారు. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు. ఏ కేటగిరీకి పంపుతున్న ఎంట్రీని స్పష్టంగా కవరుపై రాయాలన్నారు. పూర్తి వివరాల కోసం ఎస్‌ఎస్‌ఏ వెబ్‌సైట్ www.ssa.ap.gov.inను చూడాలన్నారు.
Advertisement
Advertisement