ఎర్రగుంట్ల, చక్రాయపేట, మైలవరం, సిద్దవటం, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, మైదుకూరు, బద్వేలు, రామాపురం, ఓబులవారిపల్లె, కడప, వల్లూరు మండలాల్లో విద్యా వలంటీర్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కడప వైఎస్సార్ సర్కిల్:
జిల్లాలోని ఎర్రగుంట్ల, చక్రాయపేట, మైలవరం, సిద్దవటం, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, మైదుకూరు, బద్వేలు, రామాపురం, ఓబులవారిపల్లె, కడప, వల్లూరు మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విద్యా వలంటీర్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకట సుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు డీఈడీ, బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. నెలకు వేతనంగా రూ.4 వేలు ఇస్తారని, అభ్యర్థుల ఎంపికలు రాయచోటి ఎస్‌ఎస్‌ఏ, డైట్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 23లోగా పంపాలని కోరారు.