స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఆహ్వానం
Published Mon, Aug 8 2016 5:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
గొలుగొండ: స్వచ్ఛ్ విద్యాలయ పురస్కారాలకు అన్ని పాఠశాల వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్‌ఎస్‌ఏ ప్రతినిధి ప్రసాద్ సూచించారు. చీడిగుమ్మల గ్రామంలో సోమవారం అన్ని పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్ధుల వ్యక్తిగత పరిశుభ్రత తదితర అన్ని అంశాలూ బాగుండాలన్నారు. మౌలిక సదుపాయాలు బాగున్నా పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కాలకు ఎంపికవుతాయని తెలిపారు. ఎంఈవో గండేపల్లి నాగేంద్ర మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన పాఠశాలలు ఎంపిక కావడానికి ఉపాధ్యాయులు కషి చేయాలని కోరారు. మౌలిక సదుపాయల వివరాలు, ఫొటోలు నెట్‌లో పొందుపరచాలని కోరారు.
Advertisement
Advertisement