అటవీ శాఖ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి దాకా ఆ పార్టీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఏళ్ల తరబడిగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ల పేరుతో వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న వారు లక్షల్లో ఉన్నారని, కానీ ఒక శాఖలో పనిచేసే వారినే విలీనం పేరుతో క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.