letter to CM KCR
-
‘కలిసి రండి’ తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖలు
భువనేశ్వర్: ‘దేశమంతా ఒక్కటై కరోనా మహమ్మారిని తరిమేద్దాం. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుందాం. ఏకీకృత టీకాల కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో రాష్ట్రాలు ముందుకు రావాలని’ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అందరూ ముఖ్యమంత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని హితవు పలికారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులకు బుధవారం ఆయన లేఖలు రాశారు. రాజకీయ, ఇతర భేదాభిప్రాయాలకు అతీతంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారి పోరులో పాలుపంచుకుందాం. ఇంతకుముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్లు లేఖలో పేర్కొన్నారు. రోడ్డున పడుతున్న జీవితాలు కరోనా మహమ్మారితో గత ఏడాది నుంచి ప్రపంచం తల్లడిల్లుతోంది. రెండు దశల్లో ప్రపంచ ప్రజల్ని కరోనా బెంబేలెత్తించింది. మూడో దశ ముంచుకొస్తోందనే ఆందోళన మరింతగా భయపెడుతోంది. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం, తల్లిదండ్రుల్ని కోల్పోయి పిల్లలు అనాథలవుతున్నారు. పరిశ్రమలు, వర్తక, వ్యాపారం, రవాణా రంగాలు కుదేలవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉపాధి వనరులు తగ్గిపోవడంతో పలువురి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. టీకాతో సాధ్యం కోవిడ్ టీకాతో కరోనా మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం. పలు దేశాలు కోవిడ్ టీకాలు ప్రయోగించి కరోనా విపత్తును అణిచివేశాయి. దేశ ప్రజల ప్రాణ రక్షణకు కోవిడ్ టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా పూర్తి చేయాలి. ప్రజల బాగు కోసం అన్ని రాష్ట్రాలు ఏకమై ఐక్య పోరాటానికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరికీ సత్వరమే కోవిడ్ టీకాలు అందడమే ఉద్యమ ధ్యేయం. కోవిడ్ టీకాల జాతీయ ఉత్పాదన అరకొరగా ఉంది. ప్రపంచ ఉత్పాదక సంస్థల నుంచి టీకాలు కొనుగోలు ఉద్యమానికి ఊపిరిపోస్తుంది. అంతర్జాతీయ కోవిడ్ టీకాల ఉత్పాదన సంస్థలు రాష్ట్రాలవారీ వ్యాపార ఒప్పందంపట్ల మొగ్గు కనబరచడం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి అంతర్జాతీయ ఉత్పాదన సంస్థల నుంచి కోవిడ్ టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానం ఉత్తమం. స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా టీకాల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసి అభ్యర్థించినట్లు ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నవీన్ పట్నాయక్ వివరించారు. ఈ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి తీర్మానాలు చేసి కరోనా తరిమివేతలో విజయం సాధించేందుకు ముందుకు రావాలని లేఖలో అభ్యర్థించారు. Wrote to all CMs for a consensus on centralised procurement of vaccines by GOI in view of the challenges faced by states. Spoke to some CMs who shared my views. No State is safe unless all States adopt vaccination as a top priority & execute it on war-footing. pic.twitter.com/lMkpjDeYRg — Naveen Patnaik (@Naveen_Odisha) June 2, 2021 -
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. సాంఘిక సంక్షే మ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయని, వీటిలో చదివి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీల విద్యా ప్రమాణాలను పెంచడానికి, మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. -
ఉద్యోగాలు సాధించేదాకా ఉద్యమం ఆపేది లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల సమస్య పరిష్కారమయ్యేదాకా వెనుదిరిగేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగుల పోస్టుకార్డుల ఉద్యమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ జేఏసీ నిర్వహించిన ఈ ఉద్యమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సభకు, ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకుండా నిర్బంధం విధించిం దన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల పక్షాన పోరాడి తీరుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై రౌండ్‌టేబుల్, అఖిలపక్ష భేటీలు నిర్వహించామని, ఇప్పుడు పోస్టుకార్డుల ఉద్యమం సాగుతోందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ప్రకటించాలని, కేలండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు భృతిఇవ్వా ల న్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి పోరాడుతామన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగం గాని, లేదా నిరుద్యోగ భృతి గాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్రమైన పోరా టాలకు ప్రభుత్వం సిద్ధం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జేఏసీ అధ్యక్షుడు మాదు సత్యంగౌడ్, జేఏసీ నేతలు గోపాలశర్మ, భైరి రమేశ్, నిజ్జన రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఎర్రమంజిల్‌లోని పోస్టుడబ్బాలో స్వయంగా రాసిన పోస్టుకార్డును సీఎం కేసీఆర్‌కు కోదండరాం పోస్టు చేశారు. -
అటవీ శాఖ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి దాకా ఆ పార్టీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఏళ్ల తరబడిగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ల పేరుతో వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న వారు లక్షల్లో ఉన్నారని, కానీ ఒక శాఖలో పనిచేసే వారినే విలీనం పేరుతో క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.