
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయ బ్యాంక్‌తో పాటు విలీనం కావాలన్న ప్రతిపాదనకు దేనా బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కన్సాలిడేషన్‌తో అంతర్జాతీయ బ్యాం కుల స్థాయిలో కార్యకలాపాలు సాగించగలిగే పటిష్ట బ్యాంకు ఏర్పడగలదని, దేశీయంగా.. అంతర్జాతీయంగా సమర్ధంగా పోటీనివ్వగలదని స్టాక్ ఎక్చ్సేంజీలకు దేనా బ్యాంకు తెలియజేసింది.
రుణ వృద్ధిని పెంచేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు అమలు చేసేందుకు, వ్యయాలు నియంత్రించుకునేందుకు తోడ్పడగలదని వివరించింది. దేనా, విజయా, బీవోబీల విలీనంతో ఏర్పడే కొత్త సంస్థ.. మొత్తం రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు కానుంది.