మెగా మెర్జర్: ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనం?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇ-కామర్స్ మెర్జర్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న స్నాప్ డీల్.. మరో ఆన్‌లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ తో విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ మార్కెట్ లో ప్రధాన ప్రత్యర‍్థులుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్- స్నాప్‌డీల్ విలీనంకానున్నాయని జాతీయ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ విలీనానికి జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ సారధ్యం వహిస్తోందని నివేదించింది. ఈ మేరకు ఇరు కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తోందట. అలాగే ఈ విలీన సంస్థలో 1 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ఉమ్మడి సంస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 15 శాతం ప్రైమరీ, సెకండరీ షేర్లను కొనుగోలు చేయనుందట. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద పెట్టుబడిదారు న్యూయార్క్ కు చెందిన టైగర్ గ్లోబల్ బిలియన్ షేర్లను విక్రయించనుంది.
అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్‌డీల్ సుముఖంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని ఇటీవల వార‍్తలు హల్ చల్ చేశాయి. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ సమావేశమైనట్టు కూడా వ్యాఖ్యానించాయి. ఈ వార్తలను స్నాప్‌డీల్ తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్‌డీల్ వర్గాలు ఖండిచిన సంగతి విదితమే. మరి తాజా వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ మరిన్ని నిధు లు సమీకరించుకునేందుకు కష్టాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నిధుల కొరతతో కుదేలవుతున్న ప్రస్తుతం 8,000 ఉద్యోగులను కలిగి ఉన్న స్నాప్‌డీల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఇటీవల తన ఉద్యోగుల్లో కోత పెడుతున్నట్టు సంస్థ కో ఫౌండర్ కునాల్ స్వయంగా అంగీకరించారు. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షాపోకు బై బై చెపుతున్నట్టు గత నెల ప్రకటించింది. నాన్ కోర్ ప్రాజెక్టులు తొలగించడంతో పాటు లాభదాయకమైన వృద్ధిపై దృష్టి పటిష్టం తదితర పునఃవ్యవస్థీకరణ చర‍్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నివేదించారు.