దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయమహిళా బ్యాంకు(బీఎంబీ) ను కూడా విలీనం చేసుకోనుంది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయమహిళా బ్యాంకు(బీఎంబీ) ను కూడా విలీనం చేసుకోనుంది. ఈ మేరకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మరింతమంది మహిళలకు ఎక్కువ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందకు ఈనిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తమ విశాలమైన నెట్‌వర్క్‌లో స్త్రీలకు సరసమైన క్రెడిట్ లక్ష్యాలను, లోకాస్ట్ ఫండ్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఈవిలీనమని పేర్కొంది. ఎస్‌బీఐకి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక మహిళా బ్రాంచ్‌లు 126 ఉండగా,బీఎంపీకి ఏడు శాఖలుఉన్నాయి. 20వేలకు బ్రాంచ్ లతో సేవలందిస్తున్న ఎస్‌బీఐ మొత్తం సిబ్బందిలో 22 శాతం స్త్రీలు ఉన్నారు. 2013లో భారతీయ మహిళా బ్యాంకును ఏర్పాటు చేశారు.
కాగా ఐదు అనుబంధ బ్యాంక్‌లు–స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్‌బీఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్(ఎస్‌బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్)లు ఈ ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బీఐ విలీనం కానున‍్నసంగతి తెలిసిందే.