![మొండి బాకీల రద్దును తోసిపుచ్చలేం](/styles/webp/s3/article_images/2017/09/5/71497381924_625x300.jpg.webp?itok=L-3qA3UZ)
మొండి బాకీల రద్దును తోసిపుచ్చలేం
విలీన బ్యాంకుల విషయంలో ఎస్‌బీఐ స్పందన
న్యూఢిల్లీ: విలీనం చేసుకున్న అనుబంధ బ్యాంకులకు సంబంధించి మొండి బకాయిల (ఎన్‌పీఏ) రద్దును తోసిపుచ్చలేమని ఎస్‌బీఐ పేర్కొంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలాతోపాటు భారతీయ మహిళా బ్యాంకులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బీఐలో కలిసిపోయిన విషయం తెలిసిందే. వ్యయాలు తగ్గించుకునేందుకు, నిర్వహణపరమైన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతం ఈ బ్యాంకులను తన సొంత నెట్‌వర్క్‌తో అనుసంధానించే పనిలో ఎస్‌బీఐ ఉంది.
విలీనానికి సంబంధించి ఎటువంటి మొండి బకాయిలను రద్దు చేయబోమని హామీ ఇవ్వలేమంటూ ఇటీవలే పూర్తి చేసిన క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) పత్రాల్లో పేర్కొంది. అలాగే, విలీనం చేసుకున్న బ్యాంకులను సొంత నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు అదనపు ఖర్చు కూడా అవుతుందని తెలిపింది. అయితే, విలీనం వల్ల దీర్ఘకాలంలో లాభమే కలుగుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది.