ముంబై: ట్యాక్సీ సేవల సంస్థలు ఊబర్–ఓలా మరోసారి విలీనంపై చర్చలు మొదలు పెట్టాయి. ఈ రెండు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టిన జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంకు మధ్యవర్తిత్వం నెరపుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు అందించిన సమాచారం మేరకు... రెండు కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గడిచిన కొన్ని నెలల్లో పలుసార్లు సమావేశమయ్యారు.
ఊబర్‌ను ఓలా కొనుగోలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇరు కంపెనీల్లో అతిపెద్ద వాటాదారగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ చర్చలను ముందుండి నడిపిస్తోంది. దీనిపై ఓలా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కార్యకలాపాల విస్తరణకు అన్వేషణ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సాఫ్ట్ బ్యాంకు ఇతర ఇన్వెస్టర్లు సైతం ఈ అశయ సాధనకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఊబర్ తన ఆగ్నేయాసియా వ్యాపారాన్ని ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రాబ్‌కు విక్రయించి వైదొలగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఓలాతో విలీన చర్చల అంశం వెలుగు చూడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment