
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాహుల్ సభలు వృథా ప్రయాసని.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒక గూటి పక్షులేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు చేయని పనుల్ని ఇప్పుడు చేస్తా మంటే నమ్మే వారెవరూ లేరని విమర్శించారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు త్వరలోనే తప్పకుండా కలుస్తాయని జోస్యం చెప్పారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో రాహుల్ తెలం గాణ టూర్‌పై లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment