
సాక్షి, నాగర్‌కర్నూల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిదేళ్లలో చేసిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రజా సంక్షేమ సదస్సులో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసుగు చెందారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి పార్టీ అని వ్యాఖ్యానించారు.