సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. శుక్రవారం కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఆయన పార్టీలో చేరతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మరో ఇద్దరు ముఖ్య నేతలు, మహబూబ్‌నగర్ నుంచి మరొక ముఖ్య నాయకుడు, పెద్దపల్లికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment