
సాక్షి, హైదరాబాద్: తాను 85 వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ అసలు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) చదివారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. మిత్రపక్షం ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకే సీఏఏను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏను వ్యతిరేకి స్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయాన్ని ఖండించారు.
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని మండిపడ్డారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయక తప్పదని అంబేడ్కర్ రచించిన రాజ్యాం గం స్పష్టం చేస్తుందన్నారు. సీఏఏ అమలును నిరాకరించేందుకు రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం లేదన్నారు. సీఏఏ ద్వారా ముస్లింలకూ పౌరస త్వం ఇవ్వాలని చెబుతున్న కేసీఆర్.. ఏ ముస్లింలకు ఇవ్వాలో స్పష్టం చే యాలని లక్ష్మణ్ అన్నారు. పాకిస్తాన్ ముస్లింలా.. బంగ్లాదేశ్ ముస్లింలా.. అఫ్గానిస్తాన్ ముస్లింలా? చెప్పాలన్నారు. కేసీఆర్ వెళ్లి పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాధినేతలతో మాట్లాడి భారత్‌లో విలీనమయ్యేందుకు వారిని ఒప్పించాలని అంటూ కేసీఆర్‌కు చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment