
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయేలో బీఆర్‌ఎస్ చేరుతామంటే చేర్చుకోమని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ బీఆర్‌ఎస్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.