‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’ | BJP Telangana President Laxman Fires On TRS In Bhongir | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’

Published Wed, Aug 14 2019 8:33 PM | Last Updated on Wed, Aug 14 2019 8:33 PM

BJP Telangana President Laxman Fires On TRS In Bhongir - Sakshi

సాక్షి, యాదాద్రి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక నీటి బుడగ లాంటిదని, ఎప్పుడు పేలిపోయేది తెలియదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆధికారం చేపట్టే దిదశగా బీజేపీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ పరిణామం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు ఎన్నికై 3 నెలలు గడుస్తున్నా వారికి నిధులు ఇవ్వలేదని, కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులను కేసీఆర్‌ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

రాష్టంలో 3 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారని మండిపడ్డారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌లో అంతర్గత అసంతృప్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువకులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకే ఉందని అందుకే బీజేపీలో భారీగీ చేరికలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 18న జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వేలాది మంది బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement