తెలంగాణ భవన్ నిర్మించండి
సాక్షి, ముంబై: నగరంలో తెలంగాణ భవన్ నిర్మించేందుకు సహకరించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ర చంద్రశేఖర్‌రావును తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక సభ్యులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిధిగృహంలో ఆయనతో శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ అద్భు త విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్‌కు వలసబిడ్డల సాధకబాదలతోపాటు పలు డిమాండ్లను వివరించారు.
ముంబైలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవనం నిర్మించాలని, దీర్ఘకాలిక ఉపాధి కల్పించి వలసలు జరగకుండా చూడాలని కోరారు. ముంబైతోపాటు మహారాష్ట్రలో ఉండే తెలంగాణ విద్యార్థులకు కుల ధ్రువీకరణ ఆదాయపు పత్రాలు, ఇతర విషయల్లో సహకరించాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా కలలు కన్న కల సాకారం అవుతున్న నేపథ్యంలో ముంబైలో స్థిరపడ్డ తెలంగాణ వలసబిడ్డలకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా, ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విషయాలన్నింటికి కేసీఆర్ ఎంతో ఓపిగ్గా విని సానుకూలం గా స్పందించారని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం సభ్యులు పేర్కొన్నారు. కేసీఆర్‌తో భేటీ అయి న వారిలో వేదిక కన్వీనర్లు గ్యారా శేఖ ర్, గోండ్యాల రమేష్, సింగపం గ సైదులు, స్వామి యాదగిరి, బత్తుల లింగం ఉన్నారు.
సంబరాలు చేసుకుంటాం
జూన్ రెండో తేదీ నుంచి అధికారికంగా ప్రత్యేక తెలంగాణ ఉనికిలోకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముంబైతోపాటు మహారాష్ట్రలోని వలసబిడ్డలందరు జరుపుకోవాలని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలను నిర్వహిస్తుందని కన్వీనర్లు అక్కనపెల్లి దుర్గేష్, వెంకటేష్, మచ్చప్రభాకర్‌లు పేర్కొన్నారు.
బాబును కలసిన ఆంధ్ర మహాసభ సభ్యులు
తెలుగు సంస్థలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న ఆంధ్ర మహాసభకు రావాలని ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడిని ఆహ్వానించామనిది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’ అధ్యక్షుడు సంకు సుధాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కార్యాల యంలో చంద్రబాబును ఆయ న భేటీ అయ్యారు. సీమాంధ్ర ఎన్నికల్లో విజయం సాధించిన బాబుకు అభినందనలు తెలిపారు. అనంతరం ముంబైలోని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
తెలుగువారి కోసం పని చేస్తున్న వివిధ సంస్థల గురించి తెలిపారు. ఆంధ్ర మహాసభకు సంబంధించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన వార్తను చూపించారు. అనంతరం తెలుగు సంస్థలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న ఆంధ్ర మహాసభకు రావాలని ఆహ్వానం పలికారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిం చారని, 2014 డిసెంబర్‌లోపు ఆంధ్ర మహాసభకు వస్తానని హామీ ఇచ్చారని సంకు సుధాకర్ తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో ఆంధ్ర మహాసభ సభ్యుడు సత్యం కూడా ఉన్నారు.