సాక్షి, హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులెవరు గెలిచినా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి బినామీ అని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి కలెక్టర్ కార్యాలయానికి స్థలాలు అమ్మారని ఆరోపించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిస్తే ఉత్తమ్‌కు తప్ప హుజూర్‌నగర్ ప్రజలకెలాంటి ప్రయోజనం ఉండదని, ఉత్తమ్‌కుఎ ఆమె జీ హుజూర్ అంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మణ్ గరిడేపల్లి మండలంలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ..
‘సైదిరెడ్డి గెలిస్తే 107వ ఎమ్మెల్యే అవుతాడు తప్ప ప్రయోజనం లేదు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ కొలువుల ఊసే లేదు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సుమారు 25 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాకూడా యువతకు ఉద్యోగాలు లేవు. ఈఎస్‌ఐ హాస్పిటల్ లేదు. ఉత్తమ్, కేసీఆర్, కేటీఆర్ ఉదయం తిట్టుకుంటారు. రాత్రి వేళల్లో మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో 50 వేల మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేసీఆర్ అగ్గితో గోక్కున్నావు. నీ చేతులు, ఒళ్లు కాలడం పక్క’అని లక్ష్మణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment