
సాక్షి, మెదక్ : టీఆర్‌ఎస్ ఆటలకు త్వరలో కేంద్రం కళ్లెం వేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. భారత ప్రధానిని తిట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా ప్రజలకు చేరువవుతామని, దొరల పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ టీఆర్‌ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఏమి చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానిదే. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది. టీఆర్‌ఎస్‌ను గద్దెదించడమే బీజేపీ ముందున్న సవాలు. ( మళ్లీ సహనం కోల్పోయిన నితీష్)
బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిహార్- పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వాల కోసం కాదు. బీసీ సంక్షేమం కోసం ఇచ్చిన 5000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి. దళితులకు 3 ఎకరాల భూమి, 3 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట తప్పడం ఏంట’’ని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment