
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికవడం సంతోషకరమని, తెలంగాణ బీజేపీ తరపున అభినందనలు తెలిపామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేపీ నడ్డా త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉండే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.
‘టీఆర్‌ఎస్, కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లిస్ ఒక గూటి పక్షులే. కోట్లకు పడగలు ఎత్తినవారికే టీఆర్‌ఎస్ సీట్లు ఇచ్చింది. కల్వకుంట్ల కుటుంబానికి సేవకులుగా, ఫామ్ హౌస్‌కు పాలేర్లుగా ఉండే వాళ్లకే సీట్లు ఇచ్చారు తప్ప ప్రజా సేవకులకు కాదు’అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్‌రావు తదితరులు అభినందనలు తెలిపారు. బీజేపీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్త అత్యున్నత పార్టీ పదవిలోకి వెళ్లడం సాధ్యమవుతుందని, నడ్డా అంచెలంచెలుగా ఎదిగారని కిషన్‌రెడ్డి సందేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment