మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్
చొప్పదండి: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీటూపీజీ విద్య, మహిళా సంఘాలకు వడ్డీ మాఫీలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణామఫీ, ఇందిరమ్మ ఇళ్ల ఎదుట శామియానాల నిర్మాణానికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం, నాగి శేఖర్, బండ శంకర్, ఎంపీపీ వైదల శ్రీలత, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ముద్దసాని రంగయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఆరెళ్లి చంద్రశేఖర్‌గౌడ్, మనిగాల సుధాకర్‌గౌడ్, పురం రాజేశం తదితరులు పాల్గొన్నారు.
అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం
రామడుగు(చొప్పదండి): రాష్ట్రంలో అప్పులు భారీ గా పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగా మిగిలిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని వన్నా రం, కొక్కెరకుంట, మోతె, దేశరాజ్‌పల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బూత్‌స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన చేపట్టినప్పుడు కేవలం రూ.60 వేల కోట్ల అప్పులు మాత్రమే ఉండేవని, ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్టాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారన్నారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, టీపీసీసీ ఆధికార ప్రతినిధి గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, పార్లమెంట్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగి శేఖర్, మల్యాల ఎంపీపీ శ్రీలత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనీప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment