
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న హామీలను అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టరా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వడం, అధికారంలోకి రాగానే మరిచిపోవడం సీఎంకు అలవాటుగా మారిందన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టబోననే సవాల్‌కు సిద్ధమా అని పొన్నం ప్రశ్నించారు.