మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్
కరీంనగర్: సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తీరు మారకపోతే ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శుక్రవారం అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, నేతలపై అడ్డగోలు పసలేని విమర్శలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ లోఫర్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ లోఫరేనా? కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలంతా లోఫర్ నాయకులేనా? కేటీఆర్ మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్ నేతల విమర్శలు భరించామని ఇక సహించేది లేదని, ఎదురుదాడికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మేయర్ డి.శంకర్, కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, ఒంటెల రత్నాకర్, దిండిగాల మధు, జక్కని ఉమాపతి, వేదం, చెన్నాడి అజిత్‌రావు, ఉప్పరి రవి, బాశెట్టి కిషన్, వీరారెడ్డి, కటుకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్ పాల్గొన్నారు.
అబద్దాలకే పరిమితమైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
హుజూరాబాద్: 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తూ మొదటి సంతకం చేయడం జరుగుతోందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్‌ఎస్ ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అబద్దాలకే పరిమితమైందని విమర్శించారు. కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. వైఎస్ సీఎం ఉన్న సమయంలోనే రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిందని గుర్తుచేశారు. స్వర్గం రవి, నేరేళ్ల మహేందర్‌గౌడ్, తిరుపతిరెడ్డి, రాంచంద్రం, కాసిపేట శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ గూడూరి స్వామిరెడ్డి, నరేశ్, బాబు, సుశీల, భాస్కర్, పత్తి కృష్ణారెడ్డి, అమ్జదుల్లాఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment