ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్
సాక్షి, కరీంనగర్ : కేంద్రం, రాష్టంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను వంచించాయని, ఓట్ల కోసం మభ్యపెట్టే మాటలతో వస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించి తనను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలో చేపట్టిన పాదయాత్ర సోమవారంకు మూడో రోజుకు చేరుకుంది. 7,6,10,11,12,13 డివిజన్‌లలో విక్రమ్, ఆరీఫ్, లింగంపెల్లి బాబు, ఏవీ సతీశ్, మెండి చంద్రశేఖర్, సరిళ్ల ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గంగుల కమలాకర్‌ను రెండుసార్లు గెలిపించారని అతను వ్యాపారాలకు పరిమితమయ్యాడని ఆరోపించారు. మరో అభ్యర్థి బండి సంజయ్ కలిసిమెలిసి ఉన్న హిందు, ముస్లింలలో మత విద్వేషాలు సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్నాడని వారి మాటలను నమ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, మాజీ మేయర్ డి.శంకర్, కర్ర రాజశేఖర్, అంబటి జోజిరెడ్డి, నరహరి జగ్గారెడ్డి, గందె మాధవి, తాజ్, ఆకుల ప్రకాష్, వాసాల శ్రీనివాస్, ఆగయ్య, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సమద్ నవాబ్, కార్పొరేటర్లు ఆరీఫ్, మెండి శ్రీలత, సరిళ్ల ప్రసాద్, బాకారపు శివయ్య, ఏవీ సతీష్, మహేందర్, సంతోష్, నదీమ్ పాల్గొన్నారు.
‘పొన్నం’కు మద్దతుగా ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రబాకర్‌కు మద్దతుగా 38వ డివిజన్‌లో ఇన్‌చార్జీ వై.సుకుమార్‌రావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రవిల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజక వర్గ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నంనే గెలిపించాలని కోరారు. ఎంఏ కరీం, వసీమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 39వ డివిజన్‌లో సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ అధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ డివిజన్ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీ, శివాలయం వీధి, సంజీవయ్య కాలనీల్లో డివిజన్ కన్వీనర్ దండి రవీందర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment