సాక్షి, హైదరాబాద్: కారు ఈరోజు జోరు మీద ఉండొచ్చు.. రేపు రిపేర్ కావొచ్చునని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం గాంధీభవన్‌లో పొన్నం మాట్లాడుతూ ఓటమితో ఎవరు అధైర్యపడొద్దని, గెలుపోటములు సహజమని కార్యకర్తలకు తెలిపారు. మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేదని, ఆ పార్టీ టీఆర్‌ఎస్‌కు తోకపార్టీగా మారిందని ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్లపై అసెంబ్లీసమావేశం పెట్టండి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించను న్న నేపథ్యంలో తక్షణమే అసెంబ్లీ ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లు పెంచా లని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్త మ్, భట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ బీసీలను రాజకీయాల్లోకి రాకుండా చూస్తుందని ఆరోపించారు. బీసీ సంఘాలు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment