ఏపీలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం  | AP Govt Has Started 10 Day Long Of Caste Census, More Details Inside - Sakshi
Sakshi News home page

Caste Survey In AP: ఏపీలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం 

Published Sat, Jan 20 2024 7:26 AM | Last Updated on Sat, Jan 20 2024 10:33 AM

Caste Census Begins In Andhra Pradesh - Sakshi

ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో కులగణన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎంపీడీవో పార్వతి

సాక్షి, అమరావతి: ప్రపంచంలో అతి పెద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ జరిగిన రోజే సామాజిక న్యాయానికి మరో అడుగు పడింది. రాష్ట్రంలో శుక్రవారం మరో చారిత్రక ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. శుక్రవారం తొలిరోజు 14,334 సచివాలయాల్లో కులగణన ప్రక్రియ మొదలైంది.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలం­టీర్లు ఉమ్మడిగా సచివాలయాల పరిధిలో ఇంటింటీకి వెళ్లి కులా­లవారీగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ ప్రక్రియ చేపడతారు. ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది.

శుక్రవారం ఉద­యం రాష్ట్రమంతటా ఒకేసారి కులగణన ప్రారంభం కాగా.. మొబైల్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చాలా చోట్ల వివరాల నమో­దులో ఆటంకాలు ఏర్పడినట్టు అధికారులు వెల్లడించారు.  తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5,34,160 కుటుంబాలకు సంబంధించి 10,22,764 మంది సభ్యుల వివరాల నమోదు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నెట్, సెల్‌ సిగ్నల్‌ ఉండని దాదాపు 515 గ్రామ సచివాలయాల పరిధిలో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌ విధానంలో కులగణన చేపట్టారు.

ఇదీ చదవండి: fact check: పింఛన్లపై వంచన రాతలెందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement