సాక్షి,తెలంగాణ భవన్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదిక ఓ చిత్తు పేపర్‌తో సమానమాని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ బేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులగణన తప్పుల తడక,కులగణన నివేదిక చిత్తు పేపర్.కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరిని బీసీ బిడ్డలు ఒప్పుకోవడం లేదు. బలహీన వర్గాలను చాలా స్వల్పంగా చూపించారు. కులగణన సర్వే శాస్త్రీయంగా చేయాలి. కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. దున్నపోతుమీద వాన పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైందీ?15 నెలల్లో 15పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు.
కులగణనపై రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెప్పొద్దు. బీసీ డిక్లరేషన్‌లో 42శాతం రిజర్వేషన్ అన్నారు ఏమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం సొల్లు మాటలు చెప్పడం మానాలి. పార్టీ పరంగా 42 శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటోంది.కేసీఆర్ ఎప్పుడో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా టిక్కెట్లు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు రెండు టిక్కెట్లు ఇస్తామని చెప్పి కేవలం 19 మాత్రమే ఇచ్చింది. అందులో పాతబస్తీలో 5 సీట్లు ఇచ్చారు.రాహుల్ గాంధీ,మోదీ కూర్చుని చాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుంది.రేపటి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీసీల భావజాల వ్యాప్తిలో భాగంగా కార్యక్రమాలు ఉంటాయి. కేసీఆర్,కేటీఆర్ సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.మాపై నెపం నెట్టి బీసీలకు అన్యాయం చేయొద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment