సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
జూబ్లీహిల్స్ నివాసంలో బీసీ కులగణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా.. తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్.. అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చెప్పుకొచ్చారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment