సాక్షి, న్యూఢిల్లీ: ‘జనగణనలో బీసీ కులగణన’ను లోక్‌సభ ఎన్నికల్లో తమ ఎజెండాగా తీసుకుని ముందుకెళ్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. తన ‘భారత్ జోడో’యాత్రలో కులగణన ఎంత అవసరమో గుర్తించినట్లు అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య (ఏఐబీసీఎఫ్) ప్రతినిధి బృందానికి తెలిపారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలు, అవసరాలు గుర్తించేందుకు కులగణన ఎంతో అవసరమన్నారు.
మాజీ ఎంపీ మధుయాష్కీ నేతృత్వంలో.. ఏఐబీసీఎఫ్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య అధ్యక్షతన, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు 20 బీసీ సంఘాలకు చెందిన చెందిన 36 మంది ప్రతినిధుల బృందం శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యింది. దేశ ప్రధాని బీసీ అయినప్పటికీ కులగణన విషయంలో ఆయన విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు.
మోదీ ప్రభుత్వం కులగణన చేయకుండా మోసం చేస్తోందని అన్నారు. కులగణనపై ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పట్ల ఉండాలంటే.. తెలంగాణలో ఆర్టికల్ 342–ఏ3 కింద సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చట్టం తీసుకురావాలని బీసీ నేతలు రాహుల్‌కు సూచించారు.
ఇంటింటికి అక్షింతలు సరే.. జనగణన ఎప్పుడు?
ఏపీ–తెలంగాణ భవన్‌లో ఏఐబీసీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హన్సరాజ్, తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ విజయభాస్కర్ లతో కలసి జస్టిస్ ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. జా తీయ జనగణన జరగాలనే డిమాండ్ రాహుల్ నోటి నుంచి వచ్చేసరికి బీజేపీ హిందుత్వ, అయోధ్య అంశాలను తెరపైకి తెచ్చిందంటూ మండిపడ్డారు.
ఇంటింటికి అయోధ్య అక్షింత లు పంచుతున్న బీజేపీ ప్రభుత్వం ఇంటింటికి జనగణన చేపట్టడంలో జాప్యం ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. కులగణనకు రాహుల్‌తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ మద్దతు ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరందరికీ బీసీలు అండగా నిలుస్తారని చెప్పారు.
అమలు చేసింది జగన్ మాత్రమే: దేశంలో సామాజిక న్యాయాన్ని ప్రప్రథమంగా అమలు చేసింది ఆం«ధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని ఏఐబీసీఎఫ్ ప్రతినిధి బృందం రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించింది. 50 శాతం బీసీలకు చట్టసభల్లో అవకాశం కల్పించిన ఘనత.. బడుగు, బలహీన వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నది జగన్ సర్కార్ మాత్రమేనని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment