కనీస మద్దతు ధరకు చట్టబద్ధత: రాహుల్
భోపాల్: రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ఈ రెండు అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని బంద్‌నవర్ పట్టణంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
హరిత విప్లవం, శ్వేత విప్లవం తరహాలో కులగణన కూడా ఒక భారీ విప్లవాత్మకమైన ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు కచి్చతంగా ఎవరెంత మంది ఉన్నారో కులగణన ద్వారా తెలుస్తుందని, దీని ఆధారంగా ఆయా వర్గాల కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయవచ్చని తెలిపారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక న్యాయం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రైతన్నలకు సైతం న్యాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment