కులగణనకు ఎమ్మెల్యేలే ఇన్‌ఛార్జ్‌లుగా వెళ్తారు: టీపీసీసీ చీఫ్‌ | TPCC Chief Mahesh Kumar Goud Key Comments Over Caste Census | Sakshi
Sakshi News home page

కులగణన సమావేశానికి రాహుల్‌ వస్తున్నారు: టీపీసీసీ చీఫ్‌

Published Sat, Nov 2 2024 4:33 PM | Last Updated on Sat, Nov 2 2024 5:33 PM

TPCC Chief Mahesh Kumar Goud Key Comments Over Caste Census

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డిపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు టీపీసీపీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. బీజేపీ ఆఫీసులో మహేశ్వర్‌ రెడ్డికి అసలు కుర్చీనే లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా.. మరో సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీలో కిషన్‌ రెడ్డికి, మహేశ్వర్‌ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదు. రాష్ట్రంలో​ సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుండి వస్తుంది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి?. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారు.  

ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈనెల ఆరు లేదా ఏడో తేదీన కుల గణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈనెల ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్‌లో కులగణనపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు. పార్టీ నేతలు, బీసీ నేతలు, వివిధ వర్గాల మేధావులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్‌గాంధీ వివరాలు తెలుసుకుంటారు. ప్రధాని మోదీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. విమర్శలను రాహుల్‌గాంధీ పాజిటివ్‌గా తీసుకుంటారు. కులగణన కోసం కనెక్టింగ్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించాం. కులగణనకు ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జులుగా వెళ్తారు అని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement