కుల గణన చారిత్రాత్మక విజయం: భట్టి విక్రమార్క | DYCM Bhatti Vikramarka Key Comments Over caste census In Telangana | Sakshi
Sakshi News home page

కుల గణన చారిత్రాత్మక విజయం: భట్టి విక్రమార్క

Published Thu, Nov 21 2024 1:45 PM | Last Updated on Thu, Nov 21 2024 2:45 PM

DYCM Bhatti Vikramarka Key Comments Over caste census In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు అంటూ కామెంట్స్‌ చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోంది. ప్రజావాణితో పార్టీ భావజాలాన్ని నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్య ఉండి పాలన చేసింది. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు 40శాతం పెంచి అందిస్తున్నాం. అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తెచ్చుకున్నాం. ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి.. 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక గాలికి వదిలేశారు. బీఆర్‌ఎస్‌ కుటిల ప్రయత్నాలను తట్టుకొని ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీని ప్రభుత్వం కట్టనుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కుల గణన చారిత్రాత్మక విజయం. దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుంది. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీదారులు ప్రయత్నం చేస్తున్నారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలి అని కోరుకునే వారు కుల గణనకు మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement