సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది. మేము 54వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాలల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ.64వేల కోట్లు అప్పులు చెల్లించాం.
అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం. శాలరీలు, పెన్షన్ల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాం. అధిక పన్నులు వేయకుండానే ప్రతీ పైసా అర్థవంతంగా ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మంత్రులంతా కృషి చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నాం. విద్యుత్‌పై భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నాం. మేము అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్ ప్రకటించాం’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment