సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే, బాధత్య గల శాసనసభ్యులు బజారు మీదకు వచ్చి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. బీఆర్‌ఎస్ నేతల తన్నులాట నేపథ్యంలో తమ ఉనికి కోసం బీజేపీ డ్రామాలాడుతోందన్నారు.
కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించాం. బీఆర్‌ఎస్ నేతలు అలాగే రోడ్ల మీదకు వచ్చి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వ ఏం చేయాలో అది చేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారు. వాళ్ళ మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు.
అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు వినిపించాలని కోరుకుంటున్నాం.
ప్రతిపక్ష నేతలు అంటే మాకు గౌరవం ఉంది. అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారు. ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవాలని మాకు లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితం. బీజేపీ కేవలం తమ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: హైడ్రాపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment