కేసీఆర్.. స్థాయికి మించి మాట్లాడొద్దు
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం
గంృరావుపేట : కరీంనగర్‌లో సోనియాగాంధీ సభ విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నైరాశ్యంలో పడ్డారని, అందుకే స్థాయికి మించి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సన్నాసుల చేతుల్లో అధికారం పెట్టవద్దని మాట్లాడడం కేసీఆర్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజాదరణ పొందింది కాంగ్రెస్ పార్టీ అని, అసలు పరిపాలన అంటే తెలియంది టీఆర్‌ఎస్ పార్టీ విమర్శించారు. కేసీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఆరోపణలు తగ్గించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు.